Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంరాజన్న సిరిసిల్ల జిల్లావ్యవసాయం

Rythu : రైతును రాజు చేయడమే కేసీఆర్ లక్ష్యం

రైతును రాజు చేయడమే కేసీఆర్ లక్ష్యం

– వైస్ ఎంపీపీ పీసరి భూమయ్య, – ప్యాక్స్ చైర్మన్ ఏలేటి చిన్నారెడ్డి

రుద్రంగి, (మనసాక్షి)

రైతును రాజును చేయడమే కేసీఆర్ లక్ష్యమని, మానాల గ్రామస్తులు, వరి ధాన్యయన్ని ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా వారి కష్టాలను చూసి

మంత్రి ప్రశాంత్ రెడ్డి చొరవ తీసుకొని సొసైటీ మంజూరు చేయడంతోనే మారుమూల గ్రామంలో కూడా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవడం జరిగిందని వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య అన్నారు.

 

సోమవారం రుద్రంగి మండలంలోని ఉమ్మడి మానాల గ్రామం తో పాటు బడి తండా గ్రామంలో వరి ధాన్యం కేంద్రాలను స్థానిక సర్పంచ్ అల్లూరి మనసా తిరుపతి,పాక్స్ చైర్మన్ ఏలేటి చిన్న రెడ్డి, బి ఆర్ యస్ పార్టీ మండల అధ్యక్షుడు దేగవత్ తిరుపతి, ప్రజా ప్రతినిధులతో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య,ప్యాక్స్ చైర్మన్ ఏలేటి చిన్నారెడ్డి మాట్లాడుతూ…

 

రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బాల్కొండ అభివృద్ధి ప్రదాత మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మానాల గ్రామానికి సొసైటీ మంజూరు కావడంతోనే ప్రతి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వారి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. మానాల గ్రామం అంటేనే ప్రశాంత్ రెడ్డికి ఎనలేని అభిమానమని పేర్కొన్నారు.

 

తద్వారానే ప్రత్యేక సొసైటీ ఒక మానాల గ్రామానికి ఇచ్చి తొమ్మిది గ్రామ పంచాయతీలలో రెండు వరి ధాన్యాలు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చెర్మెన్ అంబర్ సింగ్, మార్కేట్ కమిటీ డైరెక్టర్ గుగులోత్ శ్యామ్ సుందర్,విడిసి చెర్మెన్ గోపిడి రవీందర్ రెడ్డి, డైరెక్టర్లు కోడూరి రమేష్,రఘు,జక్కు లింగారెడ్డి,సీఈఓ బాధనవేని రాజారాం,తిక్క భూమయ్య,జక్కు వంశీ, పిసరి రవీందర్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు