Miryalaguda : అధ్వానంగా సాగర్ ఎడమ కాలువ లిఫ్టులు.. ఆందోళనకు సిద్ధమవుతున్న రైతులు..!
Miryalaguda : అధ్వానంగా సాగర్ ఎడమ కాలువ లిఫ్టులు.. ఆందోళనకు సిద్ధమవుతున్న రైతులు..!
వేములపల్లి, మన సాక్షి:
నాగార్జున సాగర్ ఎడమ కాలువపై ఉన్న ఎత్తిపోతల పథకాలు అధ్వానంగా మారాయి. సాగర్ ఎడమ కాలువపై 7, 8 సంవత్సరాల క్రితం ఎత్తిపోతల పథకాల ఆధునికరణ సమయంలో పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయకుండా పైప్ లైన్లు, యంత్రాలకు సంభందించిన పనులు మాత్రమే పూర్తి స్థాయిలో చేశారు.
మిగతా కాలువ పూడికలు, తూములు, షట్టర్లు, రహదారులు మరమ్మతులు చేయకుండా వదిలేశారు. దాని వలన నీరు చివర ఆయకట్టు భూములకు వెళ్ళే పరిస్థితి లేకపోవడం వల్ల అవి బీడు భూములుగా మారిపోయాయి. చివరి భూములకు నీళ్ళు వెళ్ళాలంటే తూములు, కాలువలు పూడిక తీయాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది వీటితో పాటుగా మోటార్లు, స్టాటర్లు, పంపులు, ట్రాన్స్ఫర్ లు కానీ చెడిపోయినప్పుడు బాగుచేసుకోవాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు కావాల్సి వస్తుంది.
ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రైతులు తమ సొంత ఖర్చులతో బాగుచేసుకోలేని పరిస్థితి ఉండడం వలన కొన్ని లిఫ్టులు పడావు ఉన్న పరిస్థితి ఉంది. ప్రభుత్వమే లిఫ్టుల నిర్వహణ చేయాలని రైతుల సంఘం అధ్యక్షులు పాదూరు శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. మండల పరిధిలోని లిఫ్టు ఇరిగేషన్ లను పరిశీలించారు.
ఆపరేటర్లు, లస్కర్లు, వాచ్ మెన్ లకు జీతాలు ఇచ్చేటందుకు సరిపోని పరిస్థితి ఉందన్నారు. ఎన్ఎస్పీ నుండి ఐబీ శాఖకు ఒప్పజెప్పిన తర్వాత కనీసం వాటి మరమ్మతులు చేయించుకోవడం కోసం ఎస్టిమేట్స్ కూడా సంభందించిన అధికారులు తయారు చేయడం లేదన్నారు. లిఫ్టు నిర్వాహకులు పలు మార్లు మరమ్మతులు సంభందించిన ఎస్టిమేట్స్ కోరినా కూడా వారు తయారు చేసే పరిస్థితి లేక వారు కేవలం కార్యాలయాలకే పరిమితం అవుతున్నారు.
ఇప్పటికైనా సాగర్ ఎడమ కాలువపై లిఫ్ఫు ఇరిగేషన్ లకు కేటాయించిన అధికారులు వారికి రోజుల్లో ఆయా లిఫ్ట్ ఇరిగేషన్ లకు సంబంధించిన ఎస్టిమేట్స్ తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపని యెడల ఎత్తిపోతల పథకాల రైతాంగం మొదటగా ఆయా ప్రాంతాల్లో ఉన్న ఈఈ, ఎస్ఈ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాదూరు గోవర్థన, వినోద్, చిరుమల్ల భిక్షం, రేనయ్య, పిచ్చి రెడ్డి, నాగయ్య, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Penpahad : ఎండుతున్న వరి పంటలు.. సాగు నీటి కోసం రైతుల అరిగోస..!
-
Indiramma Atmiya Bharosa : రైతు కూలీలకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో డబ్బులు జమ..!
-
Mega Job Mela : మెగా జాబ్ మేళా.. 100 కంపెనీలు, 20వేల ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రేషన్ కార్డులు కట్..!
-
Phone calls : ఇంతకాలం ఫోన్ కాల్ చేయగానే విన్నది నీ వాయిస్ ఏ నా తల్లి..!









