తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలి..!

Miryalaguda : సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలి..!

మిర్యాలగూడ, మన సాక్షి:

వానకాలం సీజన్ ముంచుకొచ్చిందని సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు వెంటనే నీటిని విడుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఆయకట్టు పరిధిలో రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారని, ఇప్పటికే దుక్కులు దున్ని, నారుమల్లు వేసుకొని నాట్లు వేసుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. బోర్లు, బావుల కింద ఇప్పటికే నార్లు వేసుకున్నారని చెప్పారు. ప్రస్తుతం ఆయకట్టు పరిధిలోని చెరువులు, కుంటలు, కాలువలు ఎండిపోయి ఉన్నాయని నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలు నింపాలని దీని వలన భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు.

ప్రస్తుతం ఎడమ కాలుకు నీటిని విడుదల చేసినట్లయితే ఆయకట్టు పరిధిలో రైతులు నాట్లు వేసుకుంటారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయాలని, షెడ్యూలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు నాణ్యమైనవి అందుబాటులో ఉంచాలని సూచించారు.

పంటలు సాగు చేసుకున్నందుకు అవసరమైన రైతు భరోసా, రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి రవి నాయక్, తిరుపతి రామ్మూర్తి, అప్పారావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Minister Ponguleti : అశ్వారావుపేటలో మంత్రి పొంగులేటి మార్నింగ్ వాక్.. ప్రజలను పలకరిస్తూ సమస్యలపై ఆరా..!

  2. Maoist : రామగుండం సీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు..!

  3. Mother : విదేశాలకు వెళ్లి బాగా డబ్బు సంపాదించారు.. తల్లిని మాత్రం ఇంట్లో నుంచి గెంటివేశారు..!

  4. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సస్పెండ్..!

మరిన్ని వార్తలు