Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : 30 ఏళ్లుగా ఒకే వ్యక్తి ఆధీనంలో.. సరాయే మీరాలం మస్జిద్ కమిటీ ఎన్నికలు నిర్వహించాలి..!

Miryalaguda : 30 ఏళ్లుగా ఒకే వ్యక్తి ఆధీనంలో.. సరాయే మీరాలం మస్జిద్ కమిటీ ఎన్నికలు నిర్వహించాలి..!

మిర్యాలగూడ, మన సాక్షి:

వక్ఫ్ బోర్డు పరిధిలోని మిర్యాలగూడ మస్జిదే సరాయి మీరాలం కమిటి ఎన్నికలు నిర్వహించాలని మిర్యాలగూడ ముసల్లియానే(నమాజ్ కు వచ్చే వారు) మస్జిదే సరాయి మీరాలం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీకి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మసీదు సభ్యులు ఎండీ అస్లం, ఏంఏ.నాహీద్, సీనియర్ జర్నలిస్ట్ ఖాజా హామిదొద్దీన్ లు మాట్లాడుతూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వక్ఫ్ బోర్డు పరిదిలోని పురాతన మస్జిదే సరాయి మీరాలమ్ (పెద్దమస్జిద్) కమిటీ కార్యవర్గం గడువు ఈ నెల 16న ముగిసిందన్నారు.

గత 30 సంవత్సరాల నుంచి మస్జిద్ కమిటి ఎన్నికలు జరగలేదని, ఒకే వ్యక్తి అతనికి సంబంధించిన మద్దతుదారుల నిర్వహణలో చాలా లోపాలు ఉన్నాయని, నిధులు కూడా పక్కదారి పట్టాయని ఆరోపించారు. పట్టణంలో ప్రధాన కూడళ్లలో ఆస్తులు ఉన్నప్పటికీ వాటికి గుర్తింపు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా మస్జిద్ కమిటీ కార్యవర్గం ఎన్నికలు నిర్వహించే విదంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికలు నిర్వహించి కొత్త కమిటిని నియమించాలని, వక్ఫ్ బోర్డు అధికారులను ఆదేశించాలని కోరారు. కార్యక్రమంలో జహంగీర్, మోయిద్, సమిఖాద్రీ. జుబేర్, జమీర్, ఆరిఫ్, ముజీబ్ తదితరులు ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు