TOP STORIESBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Nalgonda : పేదింటి విద్యార్థికి ఎంబిబిఎస్ లో సీటు. తల్లికి మూడుసార్లు బ్రెయిన్ ఆపరేషన్, ఫీజు కట్టలేక చదువులకు దూరం..!

Nalgonda : పేదింటి విద్యార్థికి ఎంబిబిఎస్ లో సీటు. తల్లికి మూడుసార్లు బ్రెయిన్ ఆపరేషన్, ఫీజు కట్టలేక చదువులకు దూరం..!

నల్లగొండ, మన సాక్షి :

కష్టపడి చదివి ఎంబీబీఎస్ లో సీటు సాధించాడు. చదువుకు పేదరికం అడ్డు రాదని నిరూపించాడు. కానీ పాపం కనీసం హాస్టల్ ఫీజు కూడా చెల్లించలేని ఆర్థిక పరిస్థితుల్లో చదువుకు దూరం కావాల్సి వచ్చింది. దాతల కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ విద్యార్థి. వివరాల ప్రకారం..

ఆ పేదింటి విద్యార్థి నీట్ లో 442 మార్కులతో ఎస్సీ కేటగిరీలో మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎంబిబిఎస్ సీటు వచ్చింది. ఈ సమయంలోనే అతని తల్లికి మూడుసార్లు బ్రెయిన్ ఆపరేషన్ కావడంతో కాలేజీలో చేరడానికి హాస్టల్ చార్జీలు ఫీజులు కలిపిసుమారు రెండు లక్షలు లేకపోవడంతో ఇంట్లోనే ఉంటూ కాలం వెళ్ళదీస్తున్నాడు.

నల్లగొండ పట్టణం శివరాం నగర్ చెందిన చెడిమెల్ల పవన్ తేజ్ దాతల నుండి సహకారం కోరుతున్నాడు. విద్యావేత్తలు గాని తన ఎంబిబిఎస్ చదువుకు సహకరించి ఆదుకోవాలని కోరుతున్నారు.

తనకు చదవాలని కోరిక ఉన్నదని తాను ఎంబిబిఎస్ చదివి డాక్టర్ అయ్యిపేద ప్రజలకు సేవ చేయాలనే తపన తో ఉన్నానని, తనకు సహాయం చేయాలనుకునేవారు 9966 384879 నెంబర్ కు గూగుల్ పే చేయాలని ఆ పేద ప్రతిభగల విద్యార్థి కోరుతున్నాడు.

MOST READ :

మరిన్ని వార్తలు