తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురాజకీయంహైదరాబాద్

TG News : తెలంగాణలో రెండో రోజు రాజకీయ రచ్చ.. నేతల మధ్య మాటల యుద్ధం..!

TG News : తెలంగాణలో రెండో రోజు రాజకీయ రచ్చ.. నేతల మధ్య మాటల యుద్ధం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో ఎన్నడూ లేనివిధంగా రాజకీయ రచ్చ కొనసాగుతుంది. ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఎలాంటి సమస్య లేకుండానే రెచ్చగొట్టుకునే వ్యాఖ్యలు చేసుకున్న ఎమ్మెల్యేల మధ్య రెండు రోజులుగా రచ్చ కొనసాగుతోంది. గురువారం హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద శేర్లింగంపల్లి అరికపూడి గాంధీ తో పాటు ఆయన అనుచరులు రచ్చ చేసిన విషయం తెలిసిందే.

ఈ విషయంపై బీఆర్ఎస్ అగ్ర నాయకులు హరీష్ రావు తో పాటు పలువురు నాయకులు సీపీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగటం.. వారిని అరెస్టు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ కొనసాగింది. కాగా శుక్రవారం కూడా అదే రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. అరికెపూడి గాంధీ నివాసం వద్ద బీఆర్ఎస్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని పాడి కౌశిక్ రెడ్డి పిలుపునివ్వడంతో మరోసారి దుమారం లేచింది.

బీఆర్ఎస్ నేతలను ఎక్కడికి అక్కడ పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. హరీష్ రావును గృహనిర్బంధం చేయగా గాంధీ ఇంటికి వెళుతుండగా పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా అరికెపూడి గాంధీ నివాసానికి ఎమ్మెల్యే దానం నాగేందర్ బ్రేక్ కు ఫాస్ట్ వెళ్లి చేశారు.

బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేయడం దారుణమని కేటీఆర్ డిమాండ్ చేయడంతో పాటు అరికెపూడి గాంధీతో పాటు ఆయన అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. హరీష్ రావును పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ కవితను కూడా పోలీసులు అరెస్టు చేశారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం కొనసాగుతోంది.

LATEST UPDATE : 

సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత.. అంత్యక్రియలు ఉండవని ప్రకటించిన సిపిఎం..!

BIG BREAKING : కేజ్రీవాల్ కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు..!

అయ్యా జిల్లా కలెక్టర్ గారూ.. చదువుకోలేము, పాఠశాల బంద్ చేసి వెళ్లిపోయిన విద్యార్థులు..!

 

మరిన్ని వార్తలు