సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత.. అంత్యక్రియలు ఉండవని ప్రకటించిన సిపిఎం..!
సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత.. అంత్యక్రియలు ఉండవని ప్రకటించిన సిపిఎం..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
గురువారం ఆయన తుది శ్వాస విడిచారు. సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12 చెన్నైలో జన్మించారు. సీతారాం ఏచూరి మృతికి రాష్ట్ర, జాతీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. మూడు పర్యాయాలు రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు. సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులుగా ఎస్ఎఫ్ఐ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిపిఎం అగ్ర నాయకులు రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, సిపిఐ నాయకులు నారాయణ తో పాటు పలువురు నేతలు ఆయనకు సంతాపం తెలిపారు.
ఆయన మృతి సిపిఎం పార్టీకే కాకుండా దేశానికి కూడా తీరని లోటని కొనియాడారు. ఆయన హైదరాబాదులో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. విద్యార్థి దశనించే ఆయన ఉద్యమాలలో పాల్గొన్నారు.
సీతారాం ఏచూరి కి అంత్యక్రియలు ఉండవని సిపిఎం ప్రకటించింది. ఆయన పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించాలని గతంలో ఆయన కోరినట్లు తెలిపారు. దాంతో ఢిల్లీ ఎయిమ్స్ కు సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని అప్పగించనున్నారు. వైద్య పరిశోధనల కోసం సీతారాం ఏచూరి పార్థివ దేహం అప్పగిస్తున్నట్లు తెలిపారు.
LATEST UPDATE :
అయ్యా జిల్లా కలెక్టర్ గారూ.. చదువుకోలేము, పాఠశాల బంద్ చేసి వెళ్లిపోయిన విద్యార్థులు..!
Runamafi : రుణమాఫీ కానీ వారికి సర్వే అయ్యిందా.. ఐతే ఖాతాలలోకి మాఫీ సొమ్ము..!
మహిళలకు సువర్ణావకాశం.. దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లో రూ.5 లక్షలు..!









