Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

BREAKING : మిర్యాలగూడ, శాలిగౌరారంలలో పెద్దఎత్తున నకిలీ పత్తి విత్తనాల పట్టివేత..!

మిర్యాలగూడ, శాలిగౌరారంలలో పెద్దఎత్తున నకిలీ పత్తి విత్తనాల పట్టివేత..!

పోలీస్, వ్యవసాయ శాఖ అధికారుల విస్తృత తనిఖీలు

తనిఖీల్లో పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు

మిర్యాలగూడ,  నల్గొండ,  మన సాక్షి:

పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించి శాలిగౌరారం ,మిర్యాలగూడ మండలాలలో అనుమానస్పద పత్తి విత్తనాలు తరలిస్తున్న వారిపై దాడి చేసి పెద్ద ఎత్తున నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు శ్రవణ్ తెలిపారు.

ఈ తనిఖీలలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలో అనుమానాస్పదంగా తరలిస్తున్న 260 కిలోల పత్తి విత్తనాలు పట్టుకోవడం జరిగిందని,అంతేకాక వారిపై ఐపీసీ సెక్షన్ 420 సెక్షన్ ప్రకారం ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి తదుపరి విచారణ కొరకు ఆదేశించినట్లు తెలిపారు.

అలాగే శాలిగౌరారం మండలంలో నకిలీ పత్తి విత్తనాలను గుర్తించడం జరిగిందని, మండలానికి సంబంధించిన ఖమ్మం పాటి సోమయ్య సన్నాఫ్ సైదయ్య వారి వద్ద నుంచి 20 కేజీల బస్తా నకిలీ పత్తి విత్తనాలు గుర్తించి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. దొరికిన విత్తనాలను బిటి త్రీ విత్తనాలుగా గుర్తించి పరీక్షకై ల్యాబ్ కు పంపించినట్లు వెల్లడించారు.

జిల్లాలోని వ్యవసాయ విస్తరణ అధికారులు వారి పరిధిలోని గ్రామాలలో పత్తి ,వరి విత్తనాలపై రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలపై రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు తెలియజేస్తున్నారని, మండల వ్యవసాయ అధికారులు మండలంలోని విత్తన విక్రయ డీలర్ల షాపులను విస్తృతంగా తనిఖీ చేసి వారి వద్ద నకిలీ విత్తనాలు గుర్తించినట్లయితే వారిపై పిడి యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.

ALSO READ : 

Gpay : గూగుల్ పే వినియోగదారులకు షాక్.. ఆ సేవలు ఇక బంద్.. ఎప్పటినుంచో తెలుసుకుందాం..!

Paddy : సన్నధాన్యంకు బోనస్.. ప్రభుత్వం కొనుగోలు చేస్తేనే ఇస్తారా.. మిల్లులో విక్రయించుకున్నా బోనస్ వస్తుందా..!

మరిన్ని వార్తలు