క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. మహిళ పై యాసిడ్ తో దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు..!

Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. మహిళ పై యాసిడ్ తో దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు..!

నల్లగొండ, మనసాక్షి:

నల్గొండ జిల్లా కోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది . నల్గొండ జిల్లా నాంపల్లి మండలం దామెర గ్రామానికి చెందిన బచ్చనబోయిన పిట్టల మహేష్ అదే గ్రామానికి చెందిన మహిళను వేధించి యాసిడ్ తో చంపేందుకు యత్నించగా బాధితురాలు నిందితుడు పిట్టల మహేష్ పైన నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన పిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేయగా బుధవారం నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితుడికి సెక్షన్ 307 ఐపిసి (హత్యాయత్నం)కింద నేరానికి పదేళ్ల జైలు శిక్ష రూ.1000/- జరిమానా, సెక్షన్ 326-ఆ ఐపీసీ (యాసిడ్ దాడి)కింద పదేళ్ల జైలు శిక్ష మరియు రూ.1000/- జరిమానా రెండూ ఏకకాలంలో (10+10= 20 సంవత్సరాల జైలు శిక్ష మరియు మొత్తం జరిమానా మొత్తం 2000/-) విధించడం జరిగిందని జిల్లా ఎస్పీఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కేసులో సరైన ఆధారాలను సేకరించి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు సమర్పించి నిందితునికి శిక్ష పడే విధంగా కృషి చేసిన అప్పటి విచారణ అధికారులు మహేశ్వర్, డిఎస్పీ దేవరకొండ, డి.విజయ్ కుమార్, ఏస్ ఐ ఆఫ్ పోలీస్, నాంపల్లి , ప్రస్తుతఏఎస్పీ పి.మౌనిక, ఐపీఎస్ దేవరకొండ, సీఐ డి.రాజు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, నాంపల్లి సర్కిల్, ఏస్ ఐ ఓఎం.శోభన్ బాబు, సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఏప పి.అఖిల, సీడీ ఓ బి.సైదులు, లైజన్ అధికారులు పి.నరేందర్, ఎన్.మల్లికార్జున్ జిల్లా ఎస్పీ అభినందించారు.

MOST READ :

  1. Nalgonda : రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలతో హడల్.. కీలక ఆదేశాలు..!

  2. Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు భారీ గుడ్ న్యూస్.. మొదటి బిల్లు చెక్కుల పంపిణీ షురూ..!

  3. TGSRTC : తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ.. ప్రభుత్వ అనుమతి..!

  4. BOI : బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గింపు..!

  5. UPI : భారత్ సొంత చెల్లింపుల యాప్‌ భీమ్.. పైసోం కా కదర్ పేరుతో కొత్త ప్రచారం..!

  6. Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఇక ఆ.. రైతుల ఖాతాలలో డబ్బులు..!

మరిన్ని వార్తలు