Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లా
Accident : విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..!
Accident : విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..!
మన సాక్షి, హైదరాబాద్ :
విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది.
లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ప్రైవేట్ బస్సు బ్రేక్ డౌన్ కావడంతో లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు మరో ప్రయాణికురాలు మృతి చెందారు.
స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వెళ్లి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ పోలీసులు క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
MOST READ :
-
Kanagal : తాను మరణించినా.. మరొకరికి దారి చూపిన హెడ్ కానిస్టేబుల్..!
-
Ration Cards : రేషన్ కార్డుదారులకు ఊహించని షాక్.. వారి కార్డులు రద్దు..!
-
Rythu Bharosa : వారికే ఒకేసారి రైతు భరోసా.. ఎప్పుడో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!
-
Sleep : పగటి పూట నిద్రపోతున్నారా.. అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
-
Rythu Bharosa : రైతు భరోసా లో కీలక మార్పులు.. బిగ్ అప్డేట్..!









