BREAKING : మైనర్ బాలికపై వేధింపులు.. ఫోక్సో కేసు నమోదు..!

మైనర్ బాలికను వేధింపులకు గురి చేయగా ఫోక్సో కేసు నమోదు చేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో సోమవారం చోటుచేసుకుంది.

BREAKING : మైనర్ బాలికపై వేధింపులు.. ఫోక్సో కేసు నమోదు..!

దమ్మపేట, మన సాక్షి :

మైనర్ బాలికను వేధింపులకు గురి చేయగా ఫోక్సో కేసు నమోదు చేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో సోమవారం చోటుచేసుకుంది.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక సత్తుపల్లి మండలంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతోంది.

ఈ క్రమంలో సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు గత నాలుగు నెలల నుంచి ఆ మైనర్ బాలికను వెంబడిస్తూ, అసభ్యకరరీతిలో వేధిస్తున్నాడు. దీంతో బాలిక తండ్రి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి తెలిపారు.

ALSO READ : BREAKING : మిర్యాలగూడ లో ఘోరం.. రైస్ మిల్లు గోడకూలి ఇద్దరు కార్మికులు మృతి..!