travelBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
Shankarpalli : శంకర్‌పల్లి టు విజయవాడ.. రాజధాని ఏసీ బస్సు..!

Shankarpalli : శంకర్‌పల్లి టు విజయవాడ.. రాజధాని ఏసీ బస్సు..!
శంకర్‌పల్లి, (మన సాక్షి):
శంకర్‌పల్లి నుండి విజయవాడకు రాజధాని ఏసి బస్సు (సర్వీస్ నెంబర్ 90061) ఆగస్టు 9వ తేదీ నుండి ప్రారంభం అవుతుందని బీహెచ్ఈఎల్ డిపో మేనేజర్ సుధ తెలిపారు. ఈ బస్సు ప్రతి శనివారం రాత్రి గం. 9 లకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుండి బయలుదేరి వయా శంకర్‌పల్లి, బీడీఎల్, పటాన్‌చెరు మీదుగా విజయవాడ చేరుతుందన్నారు.
మున్సిపల్, మండల ప్రజలు, ఓడిఎఫ్, బీడీఎల్ ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. బుకింగ్ కొరకు www.tgsrtc bus.in లో సంప్రదించాలని తెలియజేశారు. కార్యక్రమంలో కంట్రోలర్ భూషణ్, రమేష్ పాల్గొన్నారు.









