Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుటెక్నాలజీతెలంగాణహైదరాబాద్

Smart phone : మీ ఫోన్ స్లో అయిందా..? అయితే ఇలా చేయండి చాలు..!

Smart phone : మీ ఫోన్ స్లో అయిందా..? అయితే ఇలా చేయండి చాలు..!

మనసాక్షి , వెబ్ డెస్క్:

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేనివారు అంటూ ఎవరు లేరు. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పొద్దుపోయే వరకు కూడా స్మార్ట్ ఫోన్ లోనే మునిగి తేలుతున్నారు. స్మార్ట్ ఫోన్ లోనే న్యూస్, రూల్స్, యూట్యూబ్ ఛానల్ చూడటం అలవాటుగా మారింది. స్మార్ట్ ఫోన్లు వాడే వారి సంఖ్య రోజుకు పెరుగుతుంది.

 

కొంత మంది రెండు స్మార్ట్ ఫోన్ లను కూడా ఉపయోగిస్తున్నారు. కాగా స్మార్ట్ ఫోన్ యూజర్లలో చాలామంది ఫోన్లు స్లో అవుతున్నాయి, హ్యాంగ్ అవుతున్నాయి .అని చెబుతున్నారు. ఫోటోలు, వీడియోలు డౌన్లోడ్ చేస్తున్నాడంవల్ల స్మార్ట్ ఫోన్ స్లో అవుతుందని చెప్పవచ్చును.

 

అంతే కాకుండా రకరకాల యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడంతో స్టోరేజ్ నిండిపోయి ఫోన్లు స్లో అవుతున్నాయి. కానీ మీ స్మార్ట్ ఫోన్ వేగంగా స్మూత్ గా మార్చుకునే అవకాశం మీ చేతిలోనే ఉంది.

 

స్మార్ట్ ఫోన్ లోని కొన్ని సెట్టింగ్స్ ఓపెన్ చేయడం సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం , కొన్ని సెట్టింగ్స్ మారిస్తే మీ ఫోన్ వేగంగా పనిచేస్తుంది.

 


మీ స్మార్ట్ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అందులో About ఓపెన్ చేసి స్మార్ట్ వేర్ సాఫ్ట్ వేర్ అప్డేట్ అయిందో లేదో ఒకసారి చూడండి. లేకపోతే సాఫ్ట్ వేర్ అప్డేట్ చేయండివ సాఫ్టువేర్ అప్డేట్ చేయడానికి సుమారుగా 15 నిమిషాల సమయం పడుతుంది.

 

ఆ తర్వాత గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. మీ గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేశాక మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ పైన క్లిక్ చేయండి. అందులో యాప్స్ ఏవైనా అప్డేట్ చేయాల్సి ఉందేమో చూడండి. అన్ని యాప్స్ అప్డేట్ చేయండి.

 

మీ స్మార్ట్ ఫోన్ లో యానిమేషన్స్ ఉంటే ఫోను స్లోగా అవుతుంది. పాత స్మార్ట్ ఫోన్లలో యానిమేషన్స్ సరిగ్గా పనిచేయవు. అందుకోసం సెట్టింగ్స్ ఓపెన్ చేసి About పైన క్లిక్ చేయండి. బిల్డ్ నెంబర్ పైన ఏడుసార్లు టాప్ చేయండి.

 

డెవలపర్ మోడ్ ఎనేబుల్ అవుతుంది. ఆ తర్వాత సెట్టింగ్స్ లో సిస్టమ్స్ లో డెవలపర్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. స్క్రోల్ చేస్తే యానిమేషన్స్ కనిపిస్తాయి. ఆ తర్వాత యానిమేషన్స్ మొత్తం ఆఫ్ చేయండి.

ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ సెట్టింగ్స్ లో స్టోరేజ్ పైన క్లిక్ చేయండి. మేనేజ్ స్టోరేజ్ పైన క్లిక్ చేయండి… అనవసరంగా ఉన్న ఫైల్స్ ,యాప్స్ డిలీట్ చేయండి.
ముఖ్యమైన ఫైల్స్ ఉంటే వాటిని ల్యాప్టాప్ గాని కంప్యూటర్ లోకి గానీ బ్యాక్అప్ చేసుకోవాలి.

 

లేదా మెమరీ కార్డులో ట్రాన్స్ ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా టిప్స్ పాటిస్తే మీ స్మార్ట్ ఫోన్ ఫర్ఫార్మెన్స్ వేగంగా… స్మూత్ గా అవుతుంది.

Also Read : PM KISAN : పి ఎం కిసాన్ డబ్బులు ఎకౌంట్లోకి రావాలంటే రైతులు ఇలా చేయాలి..!

 

చిన్నపాటి టిప్స్ స్మార్ట్ ఫోన్లు వేగవంతం అయ్యేలా చేసుకోవచ్చు. ఈ టిప్స్ కూడా మీ స్మార్ట్ ఫోన్ ఎలాంటి మార్పులు రాకపోతే ఫైల్స్ అన్ని బ్యాకప్ చేసి స్మార్ట్ ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయాల్సి ఉంటుంది. ఫ్యాక్టరీ రీసెట్ చేసిన తర్వాత అవసరమైన యాప్స్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి.

మరిన్ని వార్తలు