Smart Ration Cards : ATM సైజులో స్మార్ట్ రేషన్ కార్డులు.. మహిళల పేరుతోనే ఆ జిల్లాల్లో పంపిణీ..!
Smart Ration Cards : ATM సైజులో స్మార్ట్ రేషన్ కార్డులు.. మహిళల పేరుతోనే ఆ జిల్లాల్లో పంపిణీ..!
మన సాక్షి, హైదరాబాద్ :
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు త్వరలో రాబోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల కోసం ఎదురుచూసిన పేదలు, కాంగ్రెస్ సర్కార్ రాగానే ప్రజా పాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. ఇటీవల రేషన్ కార్డులపై సర్వే కూడా నిర్వహించారు. అంతేకాకుండా ప్రస్తుతం మీ సేవ కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ కూడా చేపట్టారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని కోడ్ ఉన్న జిల్లాల్లో పూర్తయ్యాక చేయనున్నారు. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ లేని జిల్లాలలో రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో ఖమ్మం, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ అదిలాబాద్ జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో ఎన్నికల కోడ్ లేదు.
అయితే ఎన్నికల కోడ్ లేని జిల్లాలలో రేషన్ కార్డులు జారీ ప్రక్రియ షురూ కానున్నది. కొత్త రేషన్ కార్డులు కుటుంబంలో మహిళ పేరు మీదనే జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఏటీఎం కార్డు మాదిరిగా స్మార్ట్ రేషన్ కార్డును జారీ చేయనున్నారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
■ MOST READ :
-
Holidays : ఈ నెలలోనే మళ్లీ వరుసగా రెండు రోజులు సెలవులు..!
-
Phone : మీ ఫోన్ లోనే సింపుల్ సెట్టింగ్స్.. ఎవరూ చోరీ చేయలేరు, ఇలా చేస్తే చాలు..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
Phonepe : ఫోన్ పే లో కొత్త ఫీచర్.. మోసాన్ని నివారించవచ్చు..!
-
UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!









