Nalgonda : సారీ ఫ్రెండ్స్, సారీ టీచర్స్.. ఏ తప్పు చేయలేదు.. మిస్సింగ్ విద్యార్థుల లేఖ సోషల్ మీడియాలో వైరల్..!
Nalgonda : సారీ ఫ్రెండ్స్, సారీ టీచర్స్.. ఏ తప్పు చేయలేదు.. మిస్సింగ్ విద్యార్థుల లేఖ సోషల్ మీడియాలో వైరల్..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా లో మైనార్టీ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థుల మిస్సింగ్ కేస్ కలకలం సృష్టిస్తుంది. పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు వెళ్లిపోయి రెండు రోజులైనప్పటికీ ఇంకా వారి ఆచూకీ దొరకలేదు. కానీ ముగ్గురు కలిసి రాసిన లేక మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
దేవరకొండ నియోజకవర్గం లోని కొండ భీమనపల్లి ముస్లిం మైనారిటీ గురుకుల పాఠశాల అదృశ్యమైన విద్యార్థులు రాసిన లేఖ సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది.
ముగ్గురు విద్యార్థులు కలిసి రాసిన లేఖలో తాము ఏ తప్పు చేయలేదని, చేయని తప్పుకు కుకింగ్ చేసే వాళ్ళు మరియు స్టాఫ్ నర్స్ తమను తిట్లు తిట్టడం, ఈ విషయం మా తల్లిదండ్రులకు తెలిస్తే మేము చేయని తప్పుకు అవమానంగా భావించి పాఠశాల నుంచి వెళ్ళిపోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
తాము బిర్యాని ప్యాకెట్లు అనుకున్నామని, అందులో కల్లు ఉన్న విషయం తమకు తెలియదని లేఖలో రాసి ఉంది. తమకు ఈ జీవితం వద్దని, తాము నిర్దోషులమని చెప్పుకుంటూ సారీ ఫ్రెండ్స్ సారీ టీచర్స్ అని లేఖలో రాసి వెళ్లిపోయారు.
ఈ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై పాఠశాలను సందర్శించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారులు అప్రమత్తమై విద్యార్థుల ఆచూకీీ కనగొనేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
LATEST UPDATE :
Jagityal : ఆంక్షలు లేకుండా రైతు రుణ మాఫీ చేయాలి.. బీఆర్ఎస్ భారీ ధర్నా..!
District collector : 28న గ్రామీణ ఓటర్ల తుది జాబితా.. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..!
Ganesh Laddu : రికార్డ్ బ్రేక్.. రూ.1.87 కోట్లు పలికిన గణేష్ లడ్డు..!










