Ganesh Laddu : రికార్డ్ బ్రేక్.. రూ.1.87 కోట్లు పలికిన గణేష్ లడ్డు..!
Ganesh Laddu : రికార్డ్ బ్రేక్.. రూ.1.87 కోట్లు పలికిన గణేష్ లడ్డు..!
హైదరాబాద్, మన సాక్షి :
హైదరాబాద్ గణేష్ ఉత్సవాలు అంటే దేశవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత కలిగిందిగా చెప్పవచ్చును. ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ విగ్రహం దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అదేవిధంగా ఇప్పుడు గణేష్ లడ్డూ వేలం పాటలో కూడా హైదరాబాద్ అంటేనే ప్రాధాన్యత సంతరించుకుంది. గణేష్ లడ్డూ వేలం పాటలో ఈ ఏడాది గత రికార్డ్ బ్రేక్ అయింది.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో గణేష్ లడ్డూ రికార్డ్ బ్రేక్ అయింది. గణపతి లడ్డూ వేలం పాట విల్లాస్ లో వేలంపాట వేయగా రూ.1.87 కోట్ల రూపాయల పలికింది. ఇదే అత్యధికంగా వేలంపాట పలికిన లడ్డు ప్రసాదంలో పేరు సంతరించుకుంది.
ఈ విల్లాస్ లో ప్రతి ఏటా కూడా విల్లాస్ లో నివాసం ఉండేవారు మాత్రమే వేలంపాటలో పాల్గొంటారు. గత 13 సంవత్సరాలుగా ఇక్కడ గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది 1.25 కోట్ల రూపాయలు పలికిన లడ్డు ప్రసాదం ఈ ఏడాది 1.87 కోట్ల రూపాయలు పలికింది. కాగా లడ్డు ప్రసాద వేలం పాటకు వచ్చిన డబ్బులను విల్లా స్ అభివృద్ధి కోసమే ఉపయోగించడం విశేషం.
LATEST UPDATE :
Khairatabad : అత్యంత వైభవంగా సాగుతున్న ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర..!
పిల్లిగుండ్ల గణేష్ లడ్డూ వేలం రూ. 2. 20 లక్షలు..!
Miryalaguda : మిర్యాలగూడలో వైభవంగా అభిషేకాలతో గణేష్ నిమజ్జనం.. పాల్గొన్న ఎమ్మెల్యే బిఎల్ఆర్..!
Nalgonda : గణేష్ శోభాయాత్రలో మంత్రి కోమటిరెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ..!









