Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు

Nalgonda : గణేష్ శోభాయాత్రలో మంత్రి కోమటిరెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ..! 

Nalgonda : గణేష్ శోభాయాత్రలో మంత్రి కోమటిరెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ..! 

నల్లగొండ, మనసాక్షి :

నల్గొండ జిల్లాలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్డి పిలుపునిచ్చారు. మతం కన్నా మానవత్వం ముఖ్యమని ఆయన అన్నారు.

నల్గొండ జిల్లా మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిందని, గడచిన 30 సంవత్సరాలలో జిల్లాలో ఎలాంటి చిన్న సంఘటనలు సైతం చోటు చేసుకోలేదని తెలిపారు. గతంలో లాగే ఈ సంవత్సరం సైతం వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన గణేష్ ఉత్సవ కమిటీలకు, యువతకు పిలుపునిచ్చారు.

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్ ఒకటవ వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గణేష్ శోభాయాత్రను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గణేష్ శోభాయాత్రను జిల్లా అంతట సంతోషంగా జరుపుకోవాలని, ఎలాంటి విఘ్నాలకు తావు లేకుండా నిమజ్జనం చేయాలని అన్నారు . ప్రతి ఒక్కరు మతం కన్నా మానవత్వంతో పనిచేయాలని, పేదలను ఆదుకోవడమే మన ఆశయం కావాలని పిలుపునిచ్చారు.

జిల్లాలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందులో భాగంగా ఇదివరకే ఈద్గాను అభివృద్ధి చేశామని, భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేస్తామని, అలాగే ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సైతం అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.

జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ గణేష్ నిమజ్జనాన్ని శాంతియుతంగా జరుపుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, అందరినీ కలుపుకుని నిమజ్జనాన్ని శాంతియుతంగా జరపాలన్నారు.

అంతేకాక జిల్లా వ్యాప్తంగా నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆయన ఉత్సవ కమిటీలకు అలాగే అధికారులు, యువతకు సూచించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ,అలాగే గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగే చోట ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉందని, అక్కడ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు 600 మంది పోలీసులు, అధికారులు, సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని, సీసీ కెమెరాలతో పాటు, డ్రోన్ కెమెరాలను సైతం వినియోగిస్తున్నామని, యువత ఎక్కడ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని, శాంతియుతంగా నిమజ్జనం జరిగేందుకు సహకరించాలని కోరారు.

మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు విజయకుమార్ ,వక్త అప్పల ప్రసాద్, చింత సాంబమూర్తి, శాంతి కమిటీ సభ్యులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఖలీమ్, ఆఫీస్, గోలీ మధుసూదన్ రెడ్డి, సంపత్, నాగం వర్షిత్ రెడ్డి తదితరులు మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, అబ్బగోని రమేష్ గౌడ్, డీఎస్పీ శివరాంరెడ్డి, ఆర్ డి ఓ రవి, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్, తహసిల్దార్ శ్రీనివాస్, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు ఉన్నారు.

LATEST UPDATE : 

Rythu Barosa : 20న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై నిర్ణయం.. రైతు భరోసా ప్రారంభం అప్పుడే..!

Batti Vikramarka : రైతు రుణమాఫీ పై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం..! 

మిర్యాలగూడ : గణేష్ లడ్డు వేలం పాట.. దగ్గించుకున్న రైస్ మిల్లర్..!

Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. మాఫీ ఎప్పుడంటే, మంత్రి తుమ్మల స్పష్టం..!

మరిన్ని వార్తలు