Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Miryalaguda : రాష్ట్రస్థాయి టాలెంట్ టెస్ట్ పోటీలకు ఎస్పిఆర్ విద్యార్థులు..!

Miryalaguda : రాష్ట్రస్థాయి టాలెంట్ టెస్ట్ పోటీలకు ఎస్పిఆర్ విద్యార్థులు..!

మన సాక్షి, మిర్యాలగూడ :

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి టాలెంట్ టెస్ట్ పోటీలకు నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన ఎస్.పి.ఆర్ సెమి రెసిడెన్షియల్ విద్యార్థులు ఎంపికయ్యారు. నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సైన్స్ సంబరాల సందర్భంగా ఆ పాఠశాల విద్యార్థులు ప్రథమ బహుమతి పొంది రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన వారిలో కృత్తిక (10 వ తరగతి) శివ మాన్విత్ రెడ్డి (9వ తరగతి) స్నేహ (8వ తరగతి) ఉన్నారు. వీరు డిసెంబర్ 14, 15, 16వ తేదీలలో ఆదిలాబాద్ లో నిర్వహించనున్న పోటీలలో పాల్గొననున్నారు.

రాష్ట్రస్థాయి టాలెంట్ టెస్ట్ కు ఎంపికైన విద్యార్థులను శుక్రవారం పాఠశాలలో ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థులను అభినందించిన వారిలో పాఠశాల ప్రిన్సిపల్ కొనుగంటి శ్రీనివాస్ రెడ్డి, ఇన్చార్జి జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్స్ ఉమాకర్ రెడ్డి, అయ్యన్న తదితరులు ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు