తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Miryalaguda : నగదు బహుమతులు గెలుచుకున్న సెయింట్ జాన్స్ విద్యార్థులు..!

Miryalaguda : నగదు బహుమతులు గెలుచుకున్న సెయింట్ జాన్స్ విద్యార్థులు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సెయింట్ జాన్స్ హై స్కూల్ విద్యార్థులు వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో నగదు బహుమతులు గెలుచుకున్నారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నవంబర్ 14 బాలల దినోత్సవం పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో నగదు బహుమతులు గెలుచుకున్నారు.

నెహ్రూ ఆలోచన విధానం – శాస్త్రీయ దృక్పథం అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. కాగా హై స్కూల్ విద్యార్థులు 50 మంది పాల్గొన్నారు. ద్వితీయ స్థానంలో మహీధర్ గెలుచుకోగా అతనికి సర్టిఫికెట్ తో పాటు 3 వేల రూపాయల నగదు బహుమతి అందజేశారు.

అదేవిధంగా మూడవ స్థానంలో అభిలాష్ రెడ్డి గెలుచుకోగా సర్టిఫికెట్ తో పాటు 500 రూపాయల నగదు బహుమతిని అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ అలుగుబెల్లి శిరీష విద్యార్థులను అభినందించారు.

MOST READ : 

  1. Hyderabad : బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ.. ఒక్కొక్కరి నుంచి మూడు లక్షలు వసూలు..!

  2. Phone Calls : ట్రూ కాలర్ అవసరం లేదు.. మీకు వచ్చే కాల్స్ కు ఆధార్ లో ఉండే పేరు డిస్ ప్లే అవుతుంది..!

  3. TG News : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తేదీలు ఇవే..!

  4. Karimnagar : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. రోడ్డు ప్రమాదాల అవగాహనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్..!

  5. Miryalaguda : పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మిర్యాలగూడ నియోజకవర్గం గ్రామాల వారీగా వివరాలు ఇవీ..!

మరిన్ని వార్తలు