తెలంగాణBreaking Newsహైదరాబాద్

Godrej : అత్యాధునిక హోమ్ లాకర్లు.. ఆవిష్కరించిన గోద్రెజ్..!

Godrej : అత్యాధునిక హోమ్ లాకర్లు.. ఆవిష్కరించిన గోద్రెజ్..!

హైదరాబాద్, మన సాక్షి :

గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌లోని సెక్యూరిటీ సొల్యూషన్స్ విభాగం, హైదరాబాద్‌లో ఆధునిక గృహాలు, వ్యాపారాల కోసం టెక్-ఆధారిత ప్రీమియం హోమ్ లాకర్లను ఆవిష్కరించింది. తెలంగాణ సెక్యూరిటీ మార్కెట్‌లో తన అగ్రస్థానాన్ని బలోపేతం చేస్తూ, సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 85% హోమ్ సెగ్మెంట్ మార్కెట్ వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ లాకర్లు బయోమెట్రిక్ యాక్సెస్, ఇంటెలిజెంట్ అలారం సిస్టమ్స్, నిగూఢ స్టోరేజ్ వంటి ఫీచర్లతో రూపొందాయి. హైదరాబాద్‌లో పెరుగుతున్న పట్టణీకరణ, ఆదాయాలు, సెక్యూరిటీ అవగాహనతో మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది. వచ్చే మూడేళ్లలో హోమ్ లాకర్ సెగ్మెంట్ 18% వృద్ధి చెందనుందని అంచనా. “సెక్యూరిటీ ఇప్పుడు కేవలం రక్షణ కాదు, జీవనశైలికి అనుగుణమైన ఇంటెలిజెంట్ సొల్యూషన్స్ అందించడం.

తెలంగాణలో విస్తరించడం, అందరికీ అనువైన స్మార్ట్ సెక్యూరిటీ అందించడంపై నిబద్ధతను చాటుతుంది” అని బిజినెస్ హెడ్ పుష్కర్ గోఖలే తెలిపారు. గోద్రెజ్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తూ, రిటైల్, డిజిటల్ వ్యూహాలతో విస్తరిస్తోంది. ఎన్ఎక్స్ ప్రో స్లైడ్, రైనో రీగల్, డిఫెండర్ ఆరం ప్రో వంటి ఉత్పత్తులు ఆధునిక డిజైన్, అత్యుత్తమ భద్రతను అందిస్తాయని చెప్పారు.

MOST READ :

  1. Rythu Bharosa : రైతు భరోసా అందని రైతులకు స్పష్టత.. లేటెస్ట్ అప్డేట్..!

  2. BREAKING : అఘోరీ అలియాస్ శ్రీనివాస్ అరెస్టు.. ఉత్తరప్రదేశ్ లో అరెస్ట్ చేసిన శంకర్‌పల్లి పోలీసులు..!

  3. District collector : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

  4. Miryalaguda : ఇంటర్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థులు స్టేట్ ఫస్ట్..!

  5. Health : మీ జుట్టు నల్లబడాలా.. చాలా సింపుల్.. ఈ నీళ్లు దివ్యౌషధం..!

మరిన్ని వార్తలు