Miryalaguda : ఇంటర్ ఫలితాల్లో స్టేట్ టాపర్.. ఎస్వి మోడల్ స్కూల్ విద్యార్థి..!
Miryalaguda : ఇంటర్ ఫలితాల్లో స్టేట్ టాపర్.. ఎస్వి మోడల్ స్కూల్ విద్యార్థి..!
మిర్యాలగూడ , మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎస్సీ మోడల్ స్కూల్ కు చెందిన విద్యార్థి ఇంటర్మీడియట్ లో రాష్ట్రస్థాయి టాపర్ గా నిలిచారు. వివరాల ప్రకారం మిర్యాలగూడ పట్టణంలో ని వాసవి నగర్ నందు గల ఎస్ వి మోడల్ హై స్కూల్ నర్సరీ నుంచి పదో తరగతి వరకు చదివిన విద్యార్థి కుమ్మరి వంశీ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలలో 992 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 4 వ ర్యాంకు సాధించడం జరిగింది.
కాగా బుధవారం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి టాపర్ గా నిలిచిన విద్యార్థి వంశీని సన్మానించి స్వీట్స్ తినిపియడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వంశీ ఇంకా చదువులో రాణించాలని, ఇట్టి విజయానికి సహకరించిన పాఠశాల బృందానికి, వంశీకి వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.
పాఠశాల కరస్పాండెంట్ ఓరుగంటి శ్యాంసుందర్ మాట్లాడుతూ మా ఎస్ వి మోడల్ హై స్కూల్ చదువుకున్న విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, బ్యాంకు ఉద్యోగాలు, పోస్టల్ డిపార్ట్మెంట్ల లో ఉద్యోగాలు, వివిధ రంగాలలో మంచి ఉద్యోగాలు సాధించి మంచి పేరు సంపాదించుకున్నారని అన్నారు.
ఇట్టి విద్యార్థుల విజయాలకి తోడుపడుతున్న పాఠశాల ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఐపిసి మాశెట్టి శ్రీనివాస్, పాఠశాల డైరెక్టర్ ఓరుగంటి విశాలాక్ష్మి, ఇంచార్జ్ నాగలక్ష్మి పాల్గొన్నారు.
MOST READ :
-
Inter Results : ఇంటర్ లో 440 మార్కులకు 434 ఓ విద్యార్థినికి.. కానీ ఏమైందో చూడండి.. (వీడియో)
-
ATM : ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!
-
Sugar Patients: షుగర్ పేషంట్లు ఈ రసం తాగితే..!
-
Miryalaguda : ఇంటర్ ఫలితాల్లో సెయింట్ జాన్స్ విద్యార్థుల ప్రభంజనం..!
-
SSC : పది ఫలితాల్లో ఆ విద్యార్థిని అరుదైన రికార్డ్..!











