తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

Nalgonda : ఎరువుల నిల్వల్లో తేడా వస్తే కఠిన చర్యలు.. దుకాణాలు ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులు..!

Nalgonda : ఎరువుల నిల్వల్లో తేడా వస్తే కఠిన చర్యలు.. దుకాణాలు ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులు..!

కేతేపల్లి, మన సాక్షి:

నల్గొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని కొండకిందిగూడెం, ఇనుపాముల, కేతేపల్లి గ్రామాలలో ఉన్న ఆదీకృత విత్తనాలు, ఎరువులు,  పురుగు మందుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి బి.పురుషోత్తం తనిఖీ చేశారు. ఈ తనిఖీలో షాపులలో ఉన్న ఎరువుల నిల్వలను, వాటికీ సంబంధించిన రసీదులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరు డీలర్స్ కూడా రైతులకు నాణ్యమైన విత్తనాలు,ఎరువులు మరియు పురుగుమందులు అందుబాటులో ఉంచాలని, రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఎమ్మార్పీ ధరకే అమ్మాలని, ముఖ్యంగా ఎరువులకు సంబంధించిన బిల్స్, స్టాక్స్ రిజిస్టర్స్ రోజువారీ గా నమోదు చేయాలని, రైతులకు ఎరువులను తప్పనిసరిగా ఈపాస్ మిషన్ ద్వారానే అమ్మాలని, ఎరువుల వాస్తవ నిల్వలకు ఈపాస్ మెషిన్ నిల్వలకు ఎలాంటి తేడా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీలర్లను ఆదేశించా రు.

ఒకే రైతుకు అధిక మొత్తంలో కాకుండా, అవసరం ఉన్న మేరకు ఎరువులు అమ్మాలని ఆయన డీలర్లకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ప్రస్తుతం వ్యవసాయ అవసరా లకు కావలిసిన యూరియా, డి ఏ పి మరియు కాంప్లెక్స్ ఎరువులు మండల పరిధిలోని పిఎసిఎస్, ఏ ఆర్ ఎస్ కే, ఎన్డీసీఎంఎస్, ప్రైవేట్ ఎరువుల షాపులలో అందుబాటులో ఉన్నవి కావున రైతులకు అవసరమున్న ఎరువులను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు.

MOST READ : 

  1. Miryalaguda : వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఇద్దరు విటులు, ఆరుగురు మహిళలు అరెస్ట్..!

  2. Nalgonda : రైస్ మిల్లర్లకు వారం రోజులు గడువు.. అదనపు కలెక్టర్ ఆదేశాలు.!

  3. New Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Holidays : విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వరుసగా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..!

  5. Holidays : విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వరుసగా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..!

మరిన్ని వార్తలు