విద్యార్థి ప్రాణం బలిగొన్న ఆ ఒక్క మార్కు.. మాడ్గులపల్లి మండలంలో ఘటన – latest news

విద్యార్థి ప్రాణం బలిగొన్న ఆ ఒక్క మార్కు.. మాడ్గులపల్లి మండలంలో ఘటన

మాడ్గులపల్లి, జులై 05, మనసాక్షి: ఇంటర్మీడియేట్ పరీక్ష ఫలితాల్లో ఒకే ఒక్క మార్కు తక్కువరావడంతో తీవ్రమైన మనస్తాపానికి గురై ఆత్మహత్యత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి మృతిచెందిన సంఘటన మాడ్గులపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, వేములపల్లి ఎస్సై డి రాజు తెలిపిన వివరాల ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి…

ALSO READ : BREAKING : షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత

మాడ్గులపల్లి మండలం గుర్రప్పగూడెం గ్రామానికి చెందిన పిట్టల కార్తిక్ 17 నల్లగొండ పట్టణం రామగిరి లోని నీలగిరి జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ లో చేరి విద్యానభ్యసిస్తున్నాడు.గత నెల28న ప్రకటింటిన ఇంటర్ ఫలితాల్లో గణితం (బి)లో పాస్ మార్కులకు ఒక్క మార్కు తక్కువ  వచ్చింది.  దాంతో ఇంటర్ ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కార్తిక్ ఆత్మహత్యత్నానికి పాల్పడి వారం రోజులుగా నల్లగొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ALSO READ : BREAKING : ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

కార్తిక్ ఆరోగ్యం విషమించడంతో మంగళవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ రాజు తెలిపారు.