ట్రాక్టర్ బోల్తా పడి మహిళ మృతి

ట్రాక్టర్ బోల్తా పడి మహిళ మృతి

మిర్యాలగూడ, మన సాక్షి

ట్రాక్టర్ బోల్తా పడి మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం నల్గొండ జిల్లా మాడ్లపల్లి మండలంలోని కొత్తగూడెంలో చోటు చేసుకుంది. మాడుగుల పల్లి మండలంలోని కొత్తగూడెంలో ట్రాక్టర్ పై వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి ఇలా రైతు సింగం జానమ్మ (30) మృతి చెందింది.

 

ALSO READ : 

1. Railway Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో 3624 రైల్వే ఉద్యోగాలు..!

2. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి అదిరిపోయే సర్వీసులు..!

3. GPay : గూగుల్ పే వినియోగించే వారికి భారీ గుడ్ న్యూస్.. మళ్లీ క్యాష్ బ్యాక్.. ఎలానో తెలుసుకుందాం..!

 

 

ఈ ప్రమాదంలో ఆమె భర్త సైదులుకు కూడా గాయాలయ్యాయి. కాగా కొత్తగూడెంలోని సాయి బాలాజీ వేర్హౌసింగ్ గోదాం వల్ల మట్టిబాట గుంతల మయంగా మారిందని.. దానివల్లనే ట్రాక్టర్ బోల్తా పడి మహిళా రైతు మృతి చెందిందని ఆరోపిస్తూ గ్రామస్తులు గోదాం వద్ద ధర్నా చేపట్టారు.

 

మృతురాలి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంలో గోదాము వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు చేరుకొని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.