Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsనల్గొండ

హెల్మెట్ పెట్టండి ప్రాణాలు కాపాడుకోండి..!

రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ పొందడానికి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని చింతపల్లి ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి పేర్కొన్నారు.

హెల్మెట్ పెట్టండి ప్రాణాలు కాపాడుకోండి..!

చింతపల్లి, మనసాక్షి :

రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ పొందడానికి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని చింతపల్లి ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి పేర్కొన్నారు. శనివారం చింతపల్లి మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ బుష్పాక అనిత ఆధ్వర్యంలో గ్రామంలోని వాహనదారులకు హెల్మెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి ఆ గ్రామంలో వాహనదారులతో గ్రామ పంచాయతీ ఆవరణలో సమావేశం ఏర్పాటు చేసి ప్రతినిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల విషయంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.

ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలి సూచించారు. అదేవిధంగా లైసెన్స్ లేని చిన్నారులకు వాహనాలు ఇవ్వకూడదని పేర్కొన్నారు. గ్రామంలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ప్రమాదాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయాలన్నారు. అదేవిధంగా గ్రామంలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లయితే నేరాలను కూడా అరికట్టవచ్చునని సూచించారు.

అదేవిధంగా గ్రామాల్లో ఎవరైనా పరిచయం లేని కొత్త వ్యక్తులు సంచరించినట్లయితే తమ సమాచారం అందించాలన్నారు. గ్రామ సర్పంచ్ వాహనదారులకు హెల్మెట్ అందించడం పట్ల వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు ద్విచక్ర వాహనదారులు యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

మరిన్ని వార్తలు