Suryapet : ఏడేళ్ల చిన్నారిని బాతుల వాళ్లకు అప్పగించిన తల్లిదండ్రులు..!
ఏడేళ్ల చిన్నారిని తల్లిదండ్రులు బాతుల వాళ్లకు అప్పగించిన ఉదంతం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో వెలుగు చూసింది.

Suryapet : ఏడేళ్ల చిన్నారిని బాతుల వాళ్లకు అప్పగించిన తల్లిదండ్రులు..!
అనంతగిరి, మన సాక్షి:
ఏడేళ్ల చిన్నారిని తల్లిదండ్రులు బాతుల వాళ్లకు అప్పగించిన ఉదంతం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి మండలం పాలవరం గ్రామ శివారులోని పంట పొలాలలో సుబ్బులు, వయస్సు 7 సంవత్సరాలు, అను ఒక మైనర్ అమ్మాయి బాతులు మేపుతున్నదని స్థానికులు గుర్తించారు. పాలవరం గ్రామంలోని యువకులు చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కి సమాచారం ఇచ్చినారు.
ఆ సమాచారం మేరకు ఐసిడిఎస్, ఐసిపిఎస్, సిహెచ్ఎల్, 1098 స్టాఫ్ వారు అక్కడికి వెళ్లి ఆ పాపను అనంతగిరి పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. పాపతో మాట్లాడగా పాప యొక్క తల్లిదండ్రులైన సుబ్బయ్య, లక్ష్మి అనువారు గత నాలుగు సంవత్సరాల క్రితం బాతుల యజమాని అయిన పాలకుర్తి శ్రీకాంత్ వద్ద ఉంచి వెళ్ళిపోయినారని తెలిపినది.
అప్పటి నుంచి యజమాని అయిన పాలకుర్తి శ్రీకాంత్ ఈ బాలికను తమ ఇంట్లో పెట్టి చాకిరి, బాతులు మేపించడం, అదేవిధంగా కొట్టడం, తిట్టడం జరుగుతుంది అని తెలిపింది. ఈ విషయం పై చైల్డ్ ఆఫీసర్ నిమ్మగడ్డ శేషారత్నం, సహాయక కార్మిక అధికారి కోదాడ ఫిర్యాదు మేరకు పాలకీర్తి శ్రీకాంత్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనైనదని సిహెచ్ లింగారెడ్డి, ఏఎస్ఐ తెలిపారు.
MOST READ :
- TG News : కంబోడియాలో ఉండి ఇండియాలో డిజిటల్ అరెస్టుల పేరుతో మోసం.. చాకచక్యంగా అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు..!
- Breaking : హైదరాబాద్ – నాగార్జునసాగర్ హైవేపై రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి..!
- Miryalaguda : చేపలు పడుతుండగా కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి..!
- Breaking : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం 8 మంది మృతి..!









