Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన..!

ఎంసిపిఐయు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మిర్యాలగూడ పట్టణంలో రాజీవ్ చౌక్ వద్ద ఎంసిపిఐయు నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డి లిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా శనివారం నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.

Miryalaguda : డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన..!

మిర్యాలగూడ, మనసాక్షి :

ఎంసిపిఐయు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మిర్యాలగూడ పట్టణంలో రాజీవ్ చౌక్ వద్ద ఎంసిపిఐయు నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డి లిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా శనివారం నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంసీపీఐయు కార్యదర్శివర్గ సభ్యులు వస్కుల మట్టయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం హడావిడిగా ప్రవేశపెట్టిన మహిళ రిజర్వేషన్ బిల్లును లింకు పెట్టుకుని నియోజకవర్గాలను తమకు అనుకూలంగా పెంచుకొని 2029 ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నాలకు పార్లమెంటులో అడ్డుకట్ట పడిందన్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు అనే సెంటిమెంటుతో ప్రచారం చేసిన తమ రాజకీయాన్ని లక్ష్యం నెరవేర్చేందుకు ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం చేసిన పాచికలు పారలేదన్నారు. పార్లమెంటు సాక్షిగా ఎన్డీఏ కుట్రలను ఎండగట్టి మహిళా రిజర్వేషన్ బిల్లుతో తీసుకొచ్చిన డీలిమిటేషన్ బిల్లుల కుట్రలను బయటపెట్టిందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కు ఎవరు వ్యతిరేకం కాదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో తీసుకొచ్చిన డీలిమిటేషన్ బిల్లుల గురించి పెద్దగా చర్చ లేకుండా చేసినారని, కేంద్రపాలకులు చేస్తున్న తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాడాలన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమైన బీజేపీ రాష్ట్రాలలో 2011 జనాభా లెక్కల ప్రకారం పార్లమెంట్ సీట్లు పెంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు. దక్షిణ భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం పార్లమెంటు సీట్లు తగ్గే ప్రమాదం ఉందన్నారు. 2026 జనాభా లెక్కల ప్రకారం పార్లమెంటు సీట్లు దక్షిణ భారతదేశంలో పెంచాలని ఎంసిపిఐయు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి డీలిమిటేషన్ బిల్లు ప్రకారం అన్యాయం జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి వస్కుల సైదమ్మ, ఎంసిపిఐయు జిల్లా సహాయ కార్యదర్శి పోతుగంటి కాశి, శేఖర్, గురవయ్య, శ్రీను నాయక్, సురేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు