సెట్విన్ శిక్షణ కేంద్రాల బలోపేతమే లక్ష్యం.. కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి..!
రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ సెట్విన్ శిక్షణ కేంద్రాల కో-ఆర్డినేటర్లతో శనివారం కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్. గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సెట్విన్ శిక్షణ కేంద్రాల బలోపేతమే లక్ష్యం.. కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి..!
జహీరాబాద్, మనసాక్షి
రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ సెట్విన్ శిక్షణ కేంద్రాల కో-ఆర్డినేటర్లతో శనివారం కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్. గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ కేంద్రాల ప్రస్తుత పనితీరును సమీక్షించిన చైర్మన్, భవిష్యత్తులో చేపట్టబోయే నూతన కోర్సులు, కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
నిరుద్యోగ యువతకు నాణ్యమైన శిక్షణ అందించి, వారిని స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ డైరెక్టర్ జె. రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలను చేరవేయడంలో డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించారు. ఈ సమావేశంలో సెట్విన్ అధికారులు అకౌంట్స్ ఆఫీసర్ సురేష్ బాబు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జగన్నాథన్, ట్రైనింగ్ ఇంచార్జ్ ఎం. నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.









