Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Kethepally : తాలు పేరుతో దోపిడీ.. కొనుగోలు కేంద్రాలను సందర్శించిన తెలంగాణ మహిళా రైతు సంఘం నేత..!

తాలు పేరుతో జరిగే కోతల దోపిడీని వెంటనే అరికట్టాలని తెలంగాణ మహిళా రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Kethepally : తాలు పేరుతో దోపిడీ.. కొనుగోలు కేంద్రాలను సందర్శించిన తెలంగాణ మహిళా రైతు సంఘం నేత..!

కేతేపల్లి, మనసాక్షి :

రైతులు రేయనక పగలనక ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం ను కోత కోసిన తర్వాత కొనుగోలు కేంద్రానికి తరలిస్తే కొనుగోలు కేంద్రం లో తాలు పేరుతో కోతలు కోసి రైతులకు గిట్టుబాటు ధర అందని ద్రాక్ష గా చేస్తున్నారని, ఉన్నత అదికారులు స్పందించి వెంటనే తాలు పేరుతో జరిగే కోతల దోపిడీని వెంటనే అరికట్టాలని తెలంగాణ మహిళా రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కేతేపల్లి మండలం లోని కాసనగోడు బొప్పారం గ్రామాలలో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతు సంఘం నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏర్పాటు చేయాల్సిన వసతులు కల్పించడంలో నిర్లక్షం గా వ్యవహరిస్తున్నారని అన్నారు. సరిపడ స్థలం లేదని, మంచినీరు లేదని, చలువ పందిర్లు లేవని, వర్షాలు వస్తే పట్టాలు లేవని ఆమె విమర్శించారు.

అనేక సమస్యల నడుమ కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తూ, అందులో తాలు పేరుతో కోతలు విదిస్తు మొత్తంగా చూస్తే రైతులకు ఇంతగా కష్టం చేసినా గిట్టుబాటు ధర అందడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు చేసి కాంట వేసిన ధాన్యం రోజుల కొద్ది కళ్ళం లోనే ఉంచడం ఎంతవరకు న్యాయం అని ఆమె ప్రశ్నించారు.

లోడ్ చేసిన ధాన్యం ను మిల్లర్లు రోజుల కొద్ది దిగుమతి చేసుకోక పోవడం వల్ల తూకం తగ్గిందని సాకు చూపి కటింగ్ చేయడం అంత మోసం మిల్లర్లు అధికారుల సమన్వయ లేని కారణంగా రైతు లు నష్టపోతున్నారని, వెంటనే సంబధిత అధికారులు స్పందించి తాలు పేరుతో జరిగే దోపిడీని అరికట్టాలి అని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమం లో రైతు సంఘం మండల కార్యదర్శి చెరుకు సత్తయ్య, సంఘం మండల ఉపాధ్యక్షులు మన్నెం మల్లయ్య, గుండగాని బాగ్యమ్మ, సుంకరి సత్తయ్య, టంగుటూరి వెంకన్న, కర్ర భిక్షం రెడ్డి, నిలం సైదులు, బయ్య రామచంద్రం, కుంచం రామచంద్రం, చెరుకు నర్సయ్య, తదితర రైతులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు