Breaking Newsకరీంనగర్క్రైంజిల్లా వార్తలు
Suicide : ఉరి వేసుకుని యువతీ ఆత్మహత్య..!
ఉరి వేసుకొని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ పట్టణంలోని రేకుర్తి 20వ డివిజన్ సింహాద్రి కాలనిలో జరిగింది. వివరాల్లోకి వెళితే రేకుర్తికి చెందిన ఆరెపల్లి సుస్మిత (బన్నీ) 20 మంగళవారం ఇంటి వద్ద ఎవరు లేని సమయంలో ఇంట్లో ఉన్న ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Suicide : ఉరి వేసుకుని యువతీ ఆత్మహత్య..!
కరీంనగర్, మనసాక్షి:
ఉరి వేసుకొని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ పట్టణంలోని రేకుర్తి 20వ డివిజన్ సింహాద్రి కాలనిలో జరిగింది. వివరాల్లోకి వెళితే రేకుర్తికి చెందిన ఆరెపల్లి సుస్మిత (బన్నీ) 20 మంగళవారం ఇంటి వద్ద ఎవరు లేని సమయంలో ఇంట్లో ఉన్న ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
అయితే ఆన్లైన్ లో బ్రేడ్ ఆర్డర్ పెట్టుకోగా డెలివరీ బాయ్ వచ్చి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇంటి పక్కనే ఉన్న వారికీ అడగగా వారు ఇంటికి వెళ్లి పిలవగా ఎంతకు బయటకు రాకపోవడంతో తలుపులు తీసి చూడగా ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సుస్మితకు నాన్న లేరు అమ్మ ఒక అక్క తమ్ముడు ఉన్నాడు.