Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం
Big Breaking : ఏపీలో భారీ పేలుడు.. నలుగురు మృతి.. 12మందికి గాయాలు..!
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో నలుగురు మృతి చెందగా మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.

Big Breaking : ఏపీలో భారీ పేలుడు.. నలుగురు మృతి.. 12మందికి గాయాలు..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో నలుగురు మృతి చెందగా మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. సత్యసాయి జిల్లాలోని కదిరి మండలం కుమ్మరివాండ్ల పల్లెలో ఓ కూలి ఇంట్లో డిటోనేటర్లు నిల్వ ఉంచడంతో అవి ఒక్కసారిగా పేలాయి. నాలుగు డిటోనేటర్లు పేలి గ్యాస్ సిలిండర్ లకు అంటుకోవడంతో అవి కూడా పేలి భారీ ప్రమాదం సంభవించింది.
ఈ సంఘటనలో నలుగురు మృతిచెందగా మరో 12 మందికి గాయాలైనట్లు తెలుస్తుంది. ఈ సంఘటన జరిగిన సమయంలో ఆ ఇంట్లో 21 మంది ఉన్నట్లు సమాచారం. గాయాలైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు దాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది.