AP News : స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం..!
గత వైకాపా ప్రభుత్వంలో వైసిపి నాయకులు పాల్పడిన భూ అక్రమాలను, అరాచకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్ మోహన్ రాజు పేర్కొన్నారు.

AP News : స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం..!
– నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు
రామసముద్రం, మన సాక్షి:
గత వైకాపా ప్రభుత్వంలో వైసిపి నాయకులు పాల్పడిన భూ అక్రమాలను, అరాచకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్ మోహన్ రాజు పేర్కొన్నారు. శనివారం వారం సిద్ధవటం మండలంలో పర్యటిస్తూ స్థానిక పార్టీ కార్యాలయం నందు సిద్ధవటం మండల పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి చమర్తి జగన్ మోహన్ రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వైకాపా అరాచకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తలు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, కార్యకర్తకు ఎటువంటి ఇబ్బంది వచ్చిన అండగా ఉంటానని చమర్తి హామీ ఇచ్చారు.ఇటీవల రాష్ట్ర కమిటీలో నూతనంగా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన శనివారపు మోహన్ రెడ్డి ని అభినందించి భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు, రాష్ట్ర కార్యదర్శి శనివారపు మోహన్ రెడ్డి, పార్లమెంట్ ఉపాధ్యక్షులు నాగమణి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ యాదవ్, సింగల్ విండో చైర్మన్ దశరధ రామానాయుడు,ఆలయ చైర్మన్ రాజేంద్రప్రసాద్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి రామచంద్ర, సీనియర్ నాయకులు మల్లు వెంకట సుబ్బారెడ్డి, సామా శ్రీనివాసులు, బూసి కృష్ణారెడ్డి, పార్ల సంజీవరాయుడు, రాజారాం, బొడిచర్ల శ్రీను, పుట్ట బాబు, జింక శ్రీను, సుబ్బరాయుడు,
కుప్పాల వెంకటసుబ్బయ్య, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు చెంచయ్య నాయుడు, తుర్ర ప్రతాప్ నాయుడు, భాకరాపేట శ్రీనివాసులు, మహిళా నాయకురాలు సుబ్బమ్మ మండల క్లస్టర్ ఇన్చార్జ్లుయూనిట్ ఇన్చార్జులు గ్రామ అధ్యక్షులు బూత్ కన్వీనర్లు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.









