Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Students : ఇంటర్ చదివే విద్యార్థులు.. లక్షల రూపాయలు వారికి ఎక్కడివి.. కట్ చేస్తే పోలీసుల అదుపులో..!

Students : ఇంటర్ చదివే విద్యార్థులు.. లక్షల రూపాయలు వారికి ఎక్కడివి.. కట్ చేస్తే పోలీసుల అదుపులో..!

కొండమల్లేపల్లి జూన్ 24 మనసాక్షి :

వారు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు.. రంగారెడ్డి జిల్లా యాచారం సోషల్ వెల్ఫేర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నారు. నలుగురు విద్యార్థులు ఒకరికి ఒకరు పరిచయాలు ఏర్పడ్డాయి. అయితే ఆ తర్వాత ఏం చేశారో తెలుసుకుందాం..  నల్లగొండ జిల్లా నాంపల్లి, కొండమల్లేపల్లి, గుర్రంపొడ్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో గొర్రెల దొంగతనాలు చేయిస్తున్న నలుగురు దొంగలను అరెస్టు చేసిన కొండమల్లేపల్లి పోలీసులు.

కొండమల్లేపల్లి ఇంచార్జ్ సిఐ దగ్గు రాజు, ఎస్సై ఆజ్మీర రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. యాచారం సోషల్ వెల్ఫేర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న నలుగురు విద్యార్థులు వీరు ఒకరికి ఒకరు గా పరిచయాలు ఏర్పడి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు అన్నారు.

ALSO READ : Rythu Bharosa : 1,67,721మంది రైతుల ఖాతాల్లో రూ.215.15 కోట్లు జమ..!

జూన్ 6వ తేదీ నాడు అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో కొండమల్లేపల్లి మండలంలోని గుమ్మడవెల్లి గ్రామ శివారులో రోడ్డు పక్కన గల మేకల షెడ్డులో 10 మేకలు దొంగలు దొంగలించారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రావడంతో కొండమల్లేపల్లి ఎస్సై ఆజ్మీర రమేష్ కేసు నమోదు చేసి ఇంచార్జ్ సీఐ నాంపల్లి దగ్గు రాజు ఆధ్వర్యంలో..

పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి దొంగలను పట్టుకోనే క్రమంలో జూన్ 24 నాడు రాత్రి 10 గంటల సమయంలో కొండమల్లెపల్లి చౌరస్తాలో అనుమానాస్పదంగా కనిపించిన నలుగురు విద్యార్థులకు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి విచారించగా కొండమల్లేపల్లితో పాటు నాంపల్లిలో రెండు కేసులు, గుర్రంపొడ్ పరిధిలో ఒక కేసు మేకలను, గొర్రెలను దొంగతనం దొంగలించినట్లు ఒప్పుకున్నారు అన్నారు.

దొంగలించిన మేకలను అమ్మడంతో వచ్చిన పైసలతో జల్సాలకు అలవాటు పడి ఈదొంగతనాలు చేస్తున్నట్లు తెలిపారు. కేసును చేదించిన వారిలో ఎస్సై కొండమల్లేపల్లి అజ్మీర రమేష్, క్రైమ్ సిబ్బంది వి. హేము నాయక్, జగన్, భాస్కర్, నవీన్ రెడ్డి లను ఇంచార్జ్ సీఐ కొండమల్లేపల్లి దగ్గు రాజు అభినందించడం జరిగింది. కేసును చేదించిన వారిలో ఎస్సై కొండమల్లేపల్లి ఆజ్మీర రమేష్, క్రైమ్ సిబ్బంది వి. హేము నాయక్, జగన్, భాస్కర్, నవీన్ రెడ్డి లను ఇంచార్జ్ సీఐ కొండమల్లేపల్లి దగ్గు రాజు అభినందించడం జరిగింది.

MOST READ : 

  1. CM Revanth Reddy : స్థానిక సంస్థల ఎన్నికల అప్డేట్.. సీఎం రేవంత్ రెడ్డి వారికి వార్నింగ్..!

  2. Miryalaguda : మిర్యాలగూడలో ఘరానా మోసం.. లక్కీ డ్రా పేరుతో రూ.3.90 కోట్లు స్వాహా.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు..!

  3. Miryalaguda : రూ.3 కోట్లతో చిట్టీల వ్యాపారి రాత్రికి రాత్రే పరార్.. లబోదిబోమంటున్న బాధితులు..!

  4. Rythu Bharosa : రైతుల ఖాతాలలో రూ.48 వేలు ఒకేసారి.. రైతుభరోసా మీకు రాలేదా.. వెంటనే ఇలా చేయండి..!

మరిన్ని వార్తలు