ఆపదలో ఆదుకున్న జర్నలిస్టులు..!
ఆపదలో ఆదుకున్న జర్నలిస్టులు..!
మేడ్చల్ మల్కాజిగిరి , మనసాక్షి :
విలేఖరి అంటే జీతభత్యం లేకున్నా కూడా ప్రజలకు సేవ చేసే సైనికుడు అని మల్కాజిగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎన్ బాలరాజు అన్నారు.
గత రెండు నెలల క్రితం ప్రమాదవశాత్తు కాలుకు గాయం కావడంతో అరుంధతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మల్కాజిగిరి సీనియర్ పాత్రికేయులు మండే సురేష్ ను మల్కాజిగిరి ప్రెస్ క్లబ్ కమిటీ తరపున (518/23) శుక్రవారం అరుంధతి ఆస్పత్రికి వెళ్లి సురేష్ ను పరామర్శించి కమిటీ సభ్యుల ద్వారా సేకరించిన 21 వేల 5 వందల రూపాయలను చెక్కు రూపంలో ఆర్థిక సహాయం చేసి చేయూతను అందించారు.
ఈ మేరకు అధ్యక్షుడు ఎన్ బాలరాజు మాట్లాడుతూ విలేఖరి అంటే జీతభత్యం లేకున్నా కూడా ప్రజలకు సేవ చేసే సైనికుడు. అలాంటిది మాకు ఏదైనా ఆపద వస్తే ఆదుకోవడానికి ఆర్థికంగా జీతం లేదు. కావున మాలో మేమే ఆపద వచ్చినప్పుడు ఒకరికొకరం చేయూతనందించి సహాయం చేసుకుంటున్నాము అన్నారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ప్రెస్ క్లబ్ కార్యదర్శి వై విశాల్ యాదవ్, సునీల్ రెడ్డి, రవికుమార్ యాదవ్, మనోహర్, పవన్, కుమ్మరి రాజు, సబ్బ రాజేందర్, ప్రభాకర్, వెంకటరమణ లు పాల్గొన్నారు.
ALSO READ :
Telangana : ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారం.. కోదండరామ్ కు కీలక పదవి..!
మీకు జీరో కరెంటు బిల్లు రావట్లేదా.. అయితే వారికోసం ఓ గుడ్ న్యూస్..!
Rythu : రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్.. గాంధీ జయంతి నుంచి అమలు..!









