తెలంగాణBreaking Newsజిల్లా వార్తలు

Suryapet : సూర్యాపేట కోర్టు సంచలన తీర్పు.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో అరుగురికి జైలు శిక్ష..!

Suryapet : సూర్యాపేట కోర్టు సంచలన తీర్పు.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో అరుగురికి జైలు శిక్ష..!

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట కోర్టు సంచలన తీర్పునిచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆరుగురు జైలు శిక్ష విధించారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు సూర్యాపే పట్టణంలోని పలు ప్రాంతంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన పద్దెనిమిది మందిని ఈ రోజు కోర్టులో హాజరు పరచగా సూర్యాపేట ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి బి.వి.రమణ ఇద్దరికి రెండు రోజులు, మరో నలుగురికి ఒక్క రోజు జైలు శిక్ష మరియు ఒక్కొక్కరికి 2 వేల రూపాయల జరిమానా విధించారు.

అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన మిగతా పన్నెండు మందికి కలిపి రూ.16,500 జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పినట్లు ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తెలిపారు. ఈ సందర్భంగా సూర్యాపేట ట్రాఫిక్ ఎస్సై మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడే వారికి చలానాలు విధించడంతో పాటు కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

MOST READ :

  1. DEO : జిల్లా విద్యాశాఖ అధికారి సంచలన నిర్ణయం.. ఇద్దరు ప్రధానోపాధ్యాయుల సస్పెండ్..!

  2. Gold Price : దిగివచ్చిన బంగారం.. ఈరోజు తులం ధర ఎంతంటే..!

  3. Hair : జుట్టు రాలుతుందా.. తెల్లబడుతుందా.. అయితే ఇంట్లోనే అద్భుత పరిష్కారాలు..!

  4. Gurukula : గురుకులాల్లో తాత్కాలిక అధ్యాపకులు, ఉపాధ్యాయుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..!

మరిన్ని వార్తలు