Breaking Newsజిల్లా వార్తలుపండుగలురాజకీయంసూర్యాపేట జిల్లా

Suryapet : బిఆర్ఎస్ హయాంలోనే మైనార్టీల అభివృద్ధి..!

బిఆర్ఎస్ హయాంలోనే మైనార్టీల అభివృద్ధి చెందారని మాజీమంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.

Suryapet : బిఆర్ఎస్ హయాంలోనే మైనార్టీల అభివృద్ధి..!

సూర్యాపేట, మనసాక్షి:

బిఆర్ఎస్ హయాంలోనే మైనార్టీల అభివృద్ధి చెందారని మాజీమంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రం 48 వ వార్డు అలంకార్ థియేటర్ సమీపంలో 48 వ వార్డు బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ షేక్ యాకుబ్ పాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ముస్లిం మైనార్టీలకు కేసీఆర్‌ కొండంత అండగా ఉన్నారని అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ముస్లిం మైనార్టీలు ఎంత నష్ట పోయారో వారికి తెలుసని అన్నారు. సూర్యాపేట అభివృద్ధి చెందిందంటే బిఆర్ఎస్ ప్రభుత్వం లోనే అని అన్నారు. ఈ కార్యక్రమంలో మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, జీడి బిక్షం, కౌన్సిలర్స్ గాలిసాయి కిరణ్, ఈద ప్రవీణ్, బత్తుల రమేష్, మీల వంశీ, షణగాని అంజలి, యూసుఫ్, షరీఫ్, ముజఫర్, సత్య, బషీర్, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు