Suryapet : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి..!
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Suryapet : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి..!
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలకు వెళితే జాటోతు ప్రవీణ్ (32) అనే వ్యక్తి హైదరాబాదులో కారు డ్రైవర్ పని చేసుకుంటూ జీవన కొనసాగించేవాడు. పని ముగించుకొని ఆయన స్వగ్రామం మహబూబాద్ జిల్లా నరసింహుల పేట మండలం, పడమటి గూడెం చారి తండా గ్రామం. భార్య పిల్లల వద్దకు వస్తుండగా మార్గమధ్యంలోని తిరుమలగిరి తహసిల్దార్ కార్యాలయం దాటిన తర్వాత ప్రమాదం చోటుచేసుకుంది.
స్థానికుల సమాచారం తో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుని కుటుంబ సభ్యులకు ఫోన్ సమాచారం ద్వారా అందించారు.మృతుడు వాడిన ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఎవరైనా ఢీకొన్నారా లేకపోతే బైక్ స్కిడ్ అయి పడిపోయాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఆసుపత్రి తరలించారు.
MOST READ
- Big Breaking : ఆంధ్రప్రదేశ్ లో భారీ పేలుడు.. 21 మంది మృతి..!
- Nalgonda : జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కీలక ప్రకటన.. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత..!
- Nalgonda : నల్గొండ జిల్లాలో రూ.15 లక్షల బంగారం పోగొట్టుకున్న మహిళ.. గంటల్లో రికవరీ ఎలా అయిందంటే..!
- Fake Company : నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు.. బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్..!









