Nalgonda : నల్గొండలో జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల అనుమానితులు.. ఎయిర్ గన్స్ గంజాయి చాక్లెట్స్, హుక్కా స్వాధీనం చేసుకున్న పోలీసులు..!
Nalgonda : నల్గొండలో జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల అనుమానితులు.. ఎయిర్ గన్స్ గంజాయి చాక్లెట్స్, హుక్కా స్వాధీనం చేసుకున్న పోలీసులు..!
నల్లగొండ, మన సాక్షి :
నల్లగొండ వన్ టౌన్ పరిధిలో గల మాన్యంచెల్కా లో శుక్రవారం తెల్లవారుజామున ఒక్క డిఎస్పి8 మంది సీఐలు 24 మంది యస్.ఐలు మొత్తం కలిపి 320 మంది పోలీస్ సిబ్బంది,ఒక ఎక్స్ క్లూజివ్ డాగ్, నార్కోటిక్ డాగ్ తో దాదాపు 500 ఇళ్లల్లో సోదాలు చేయగా, సరియైన పత్రాలు లేని 165 వాహనాలు, నాలుగు ఆటోలు, గంజా చాక్లెట్స్, రెండు హుక్కా పార్ట్, ఒక ఎయిర్ గన్ సీజ్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
ఎక్కువగా జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన 150 అనుమానితులను గుర్తించడం జరిగిందని తెలిపారు. అలాగే నలుగురు రౌడీ షీటర్స్ అదుపులో తీసుకోగా వీరిలో ఒకరీ వద్ద నుండి ఎయిర్ గన్ స్వాధీనం చేసుకోవడం జరిగిందనీ అన్నారు. మొత్తం 30 మందిని గాంజా టెస్ట్ నిర్వహించగా 8 మంది సేవించినట్టు టెస్టులో రిపోర్ట్స్ రావడం జరిగిందని, వీరు ఎక్కడి నుంచి కొనుగోలు చేసి సేవించారనే దానిపైన విచారణ జరుపుతున్నామని అన్నారు.
ముఖ్యంగా కమ్యూనిటి కాంటాక్టులో భాగంగా పట్టణంలో కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. కాలనీల్లో,ఇంటి ప్రదేశాల్లో అనుమానితంగా ఎవరైనా కనబడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు. కొత్తగా ఇండ్లకు కిరాయిలకు వచ్చే వారి పూర్తి వివరాలు తెలుసుకున్నాకే ఆద్దెలకు ఇవ్వాలని సూచించారు. నేరరహిత పట్టణంగా తీర్చి దిద్దడంతోపాటు ప్రజలకు శాంతిభద్రతలు కల్పించాలని గంజాయి తదితర మాదకద్రవాలను నిలువరించడం కోసం కృషీ చేస్తున్నామని తెలిపారు.
జిల్లాలో గంజాయిని ఆరికట్టడం కోసం మూడు దశల్లో కార్యాక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎక్కడైన గంజాయి సేవిస్తున్నట్లు,విక్రయించినట్లు, కానీ రవాణా చేస్తున్నట్లు కానీ తెలిస్తే డయల్ 100 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. తప్పుడు డాక్యుమెంట్లతో ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, నేర నియంత్రణకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శివరాం రెడ్డి,సీఐలు రాజశేఖర్ రెడ్డి, రాఘవరావు, ఆదిరెడ్డి, కొండల్ రెడ్డి, నాగరాజు, రాజశేకర్, సీఐ మహాలక్ష్మయ్య, కరుణాకర్ ఎస్ఐలు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
క్లిక్ చేసి ఇవి కూడా చదవండి
-
Miryalaguda : మిర్యాలగూడ – కాచిగూడ ట్రైన్ లో మంటలు..!
-
Fake PassPort ; నకిలీ పాస్ పోర్టులతో విదేశి ప్రయాణానికి యత్నం.. పోలీసుల అదుపులో ఐదుగురు..!
-
TG News : భూ భారతి ఫైలెట్ మండలాలే రాష్ట్రానికి దిక్సూచి.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..!
-
Nalgonda : నల్గొండ జిల్లా మాడుగులపల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ ను ఢీకొట్టిన బొలెరో..!
-
Gold Price : బంగారం ధర డమాల్.. ఒకే రోజు రూ.21,300 తగ్గింది.. ఈ రోజు ఎంతంటే..!










