ఖమ్మం జిల్లాBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలు
Tahsildar : ముదిగొండ నూతన తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన రవి.. ఎవరో తెలుసా..!
ఖమ్మం జిల్లా ముదిగొండ మండల తహసీల్దార్‌గా రవి శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో కూసుమంచి మండల తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన ఆయన, బదిలీపై ముదిగొండకు విచ్చేశారు.

Tahsildar : ముదిగొండ నూతన తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన రవి.. ఎవరో తెలుసా..!
ముదిగొండ, (మన సాక్షి):
ఖమ్మం జిల్లా ముదిగొండ మండల తహసీల్దార్‌గా రవి శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో కూసుమంచి మండల తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన ఆయన, బదిలీపై ముదిగొండకు విచ్చేశారు. కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ రవిని రెవిన్యూ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. సిబ్బంది ఆయనకు పూల మొక్క అందజేసి, సాదరంగా ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
గతంలో ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేసిన సునీతా ఎలిజబెత్ కలెక్టరేట్‌కు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో రవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తహశీల్దార్ రవి మాట్లాడుతూ మండల అభివృద్ధికి అలాగే ప్రజలకు మెరుగైన రెవిన్యూ సేవలు అందించడానికి తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తహసీల్దార్ పేర్కొన్నారు.









