Kavitha : టార్గెట్ హరీష్.. సంచలన ఆరోపణలు చేసిన కవిత..!

Kavitha : టార్గెట్ హరీష్.. సంచలన ఆరోపణలు చేసిన కవిత..!
మన సాక్షి, హైదరాబాద్ :
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు సంతోష్ రావులపై కవిత ఆరోపణలు చేస్తూ ఆమె ప్రెస్ మీట్ సాగింది. వారిద్దరూ బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారని కవిత ఆరోపించారు. ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ ను గెలిపించింది హరీష్ రావే అని ఆమె పేర్కొన్నారు.
ఇప్పుడు తనలాగే కేటీఆర్ కు కేసిఆర్ కు కూడా ఇదే జరుగుతుందని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఒకే విమానంలో ప్రయాణించారు.. రేవంత్ కాళ్లు హరీష్ రావు పట్టుకున్నాకే ఈ కుట్రలు మొదలయ్యాయని ఆమె ఆరోపించారు.
హరీష్ రావుకు పాల వ్యాపారం ఉండేదని, అధికారంలోకి రాగానే హాస్టల్ లకు పాలు సరఫరా చేశారని ఆరోపణలు ఉన్నాయి.. లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్ రెడ్డి అంటున్నారు.. కానీ హరీష్ రావు గురించి ఒక మాట కూడా మాట్లాడటం లేదని, కేవలం కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
కేసీఆర్ పై సిపిఐ విచారణ వచ్చిందంటే అందుకు హరీష్ రావు, సంతోష్ రావే కారణమంటూ కవిత మరోసారి ఆరోపించారు. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు.. డబుల్ షూటర్ కెసిఆర్ కు హరీష్ రావు కట్టప్ప లాగా అంటారు. హరీష్ రావు ఒక దశలో తన పక్కన ఎమ్మెల్యేలు పెట్టుకోవాలని చూశాడు. నా ప్రాణం పోయినా కేసిఆర్ కు అన్యాయం జరగనివ్వనని ఆమె పేర్కొన్నారు.
కెసిఆర్ ను పార్టీని నేనెందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటా.. అధికారంలో ఉన్నా.. లేకున్నా నేను ఒకేలాగా ఉన్నాను. అధికారంలో ఉన్న నన్ను ప్రతిపక్ష ఎంపి గానే చూశారని ఆమె పేర్కొన్నారు. ఆరడుగుల బుల్లెట్ ఇప్పుడు నన్ను గాయపరిచింది.. అంటూ ఆమె పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాలకు వెళ్లి కుట్రలు చేశారు. వారి వల్లనే విజయశాంతి, ఈటెల రాజేందర్, మైనంపల్లి తో పాటు ఎంతోమంది పార్టీని వీడారని ఆమె పేర్కొన్నారు. దళితులు మరణించిన అంశంలో కూడా రామన్ననే డామినేట్ చేశారు. కేటీఆర్ ను ఓడించేందుకు ప్రత్యర్థులను హరీష్ రావు డబ్బులు పంపారు.. అంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ కీలక ఆదేశాలు.. ఆ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి..!
-
Miryalaguda : జడ్చర్ల-కోదాడ హైవె విస్తరణ పనులు వేగవంతం చేయాలి..!
-
Agricultural Tools : వారికి వ్యవసాయ పరికరాలు 50 శాతం సబ్సిడీ.. ధరఖాస్తు ఇలా..!
-
Pavan Kalyan : ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు..!
-
Shoes : షూస్ ఎంపిక ఎలా ఉండాలో తెలుసా.. ఇలా ఉంటేనే కొనండి..!
-
Holidays : విద్యార్థులకు మళ్లీ ఎగిరిగంతేసే న్యూస్.. వరుస సెలవులు..!









