తెలంగాణBreaking Newsవైద్యంహైదరాబాద్

TG News : ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. రైతు భరోసా పై సీఎం రేవంత్ ఆదేశాలు..!

TG News : ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. రైతు భరోసా పై సీఎం రేవంత్ ఆదేశాలు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయం వేదికగా తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. కాగా ఈ కేబినెట్ సమావేశంలో ఐదు ఆర్డినెన్స్ లకు ఆమోదం తెలిపింది.

ముఖ్యంగా రైతు భరోసా పై సమావేశంలో కీలకంగా చర్చించారు. సంక్రాంతి పండుగ నుంచి ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుల ఖాతాలలో రైతు భరోసా నగదును జమ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అదే విధంగా భూమిలేని నిరుపేదలకు ఏడాదికి 12 వేల రూపాయలు అందజేసే విషయంపై చర్చించారు. ఆర్ ఓ ఆర్ చట్టం పైన చర్చ కొనసాగింది. ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామపంచాయతీలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేయడానికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది.

MOST READ : 

మరిన్ని వార్తలు