Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : తెలంగాణ ప్రధాత తల్లి సోనియమ్మ..!

Miryalaguda : తెలంగాణ ప్రధాత తల్లి సోనియమ్మ..!

మిర్యాలగూడ, మన సాక్షి :

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ
జన్మదినాన్ని పురస్కరించుకొని మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ లో కేక్ కట్ చేసి మిఠాయి పంపిణీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుండి ర్యాలీగా బయలుదేరి స్థానిక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పాలు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాల్గొన్న ముఖ్య నాయకులు మాట్లాడుతూ సోనియా గాంధీ నిస్వార్ధంగా ఈ దేశానికి చేసిన సేవలు అమోఘమైనవని, సోనియా గాంధీ రాజీవ్ గాంధీ మరణానికి ముందు ఒక సాధారణ గృహిణి లా కేవలం రాజీవ్ గాంధీ కి భార్యగా మాత్రమే మన దేశ ప్రజలకు తెలుసునని అన్నారు. రాజీవ్ గాంధీ మరణం తర్వాత మారినటువంటి రాజకీయ పరిస్థితుల వలన ప్రధానిగా పీవీ నరసింహారావు కావడం ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నానాటికి బలహీనం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టి భారతదేశ రాజకీయాలలోకి రాక తప్పలేదన్నారు.

బిజెపి లాంటి మతతత్వ పార్టీలు సోనియాగాంధీ విదేశీ మహిళగా ఆమెను అవమానపరిచిన నేపథ్యంలో ఆమె ప్రధానమంత్రి పదవిని సునాయాసంగా వదిలి ప్రధానమంత్రి పదవిని సైతం త్యాగం చేసి క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగారన్నారు. అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి శరవేగంగా మారుతున్న రాజకీయాలను అర్థం చేసుకొని ఆమె క్రియాశీలక పాత్రను పోషించి యూపీఏ ని స్థాపించి యూపీఏ చైర్మన్ గా దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొని వెళ్లి ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ని ప్రధానమంత్రిని చేసి వారికి దశ దిశా నిర్దేశం చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది భారతదేశాన్ని ఆర్థిక మాంద్యం నుండి కాపాడిందన్నారు.

ప్రపంచంలోనే భారతదేశం ఐదో ఆర్థిక శక్తిగా ఎదటానికి మన్మోహన్ సింగ్ పాలనాదక్షిత సోనియాగాంధీ ముందుచూపు ఎంత దోహదం చేశాయని, 2009 కాలంలో అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు కూడా ఆర్థిక మంద్యంలో చిక్కుకోగా మన దేశం మాత్రం సురక్షితంగా ఉందన్నారు.

డాక్టర్ అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 123 అను ఒప్పందాన్ని తీసుకొస్తే బిజెపి , యూపీఏ భాగస్వామ్య పార్టీలైన వామపక్షాలు వ్యతిరేకించినప్పటికీ ఆ ఒప్పందం జరగడంలో సోనియా కీలకపాత్రను పోషించి భారతదేశాన్ని అను శక్తి రంగంలో కీలకంగా నిలబెట్టిన ఘనత సోనియా గాంధీ దని, అదేవిధంగా తెలంగాణ సాధన విషయంలో ఆమె తన జన్మదినం రోజు ప్రకటించినటువంటి ప్రత్యేక తెలంగాణ హామీని నెరవేర్చి ఆమె మాట నిలబెట్టుకోవడం ఆమె గొప్పతనానికి నిదర్శనమన్నారు.

తల్లి సోనియా గాంధీకి ఆమె జన్మదినం రోజున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి ఆమెకు ఒక గిఫ్ట్ ఇచ్చామని, ఆనాడు 65 వేలకోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణను సోనియా గాంధీ గారి ఇస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ వైన్స్ టెండర్ల డబ్బులను, ఔటర్ రింగ్ రోడ్, ఉద్యోగస్తుల జిపిఎఫ్ డబ్బులు లాంటివి ఎన్నో రకాలుగా 7.30 లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా మార్చి తెలంగాణను దివాలా తీయించిన ముఖ్యమంత్రిగా కెసిఆర్ దివాళి కోరుతనాన్ని చూయించారని అన్నారు.

అప్పుల తెలంగాణను చేతబట్టిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు మరియు అసలు కట్టుకుంటూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, గ్యాస్ సిలిండర్లకు 500 రూపాయలు, రైతులకు రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు, విద్య, ఉపాధి, వైద్య, రంగాలపై దృష్టి సారిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని అన్నారు. బీసీ కులగలను చేపట్టి తెలంగాణను ముందంజలో ఉంచారని అందుకు మేమంతా సంతోషిస్తున్నామని వారన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిరుమర్రి కృష్ణయ్య, పగిడి రామలింగయ్య, చిలుకూరి బాలకృష్ణ,  రెడ్డి, గాయం ఉపేందర్ రెడ్డి , పొదిల శ్రీనివాస్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, శాగ జలంధర్ రెడ్డి, మండలపార్టీ అధ్యక్షుడు బసవయ్య గౌడ్, పైడిమర్రి నరసింహారావు, పగిడి రామలింగయ్య, మహబూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు