Nalgonda : తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం.. బతుకమ్మ పండుగ..!

Nalgonda : తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం.. బతుకమ్మ పండుగ..!
చింతపల్లి, మన సాక్షి :
తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం ఆనందం, ఐక్యతల సమ్మేళనం,తెలంగాణ ఆడబిడ్డల పూల సంబురం బతుకమ్మ పండుగ అని నల్లగొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ మాజీ ఛైర్మన్ చింతపల్లి మాజీ జడ్పీటిసి కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి అన్నారు.
సోమవారం చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద సద్దుల బతుకమ్మ పండగ సందర్భంగా ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలతో కలిసి ఆమె బతుకమ్మ ఆటలు ఆడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ అంటే మన ఇంటి మహాలక్ష్మి అని, ప్రతి ఆడబిడ్డ గౌరమ్మను పూజించడంతో ప్రతి ఇల్లు సకల సంపదలతో తులతూవుతుందన్నారు. గత తొమ్మిది రోజులుగా ప్రతిరోజు గ్రామాలలో బతుకమ్మలను పేర్చి మహిళలు ఆటపాటలతో సంబరాలు చేసుకోనీ ఎంతో భక్తి భావంతో బతుకమ్మను చెరువులు నిమజ్జనం మేడం తెలంగాణ సాంస్కృతికి నిదర్శనం అన్నారు. అనంతరం మండలంలోని ప్రతి ఆడపడుచుకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.
MOST READ :
-
BIG BREAKING : నాగార్జునసాగర్ హైవే పై రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి..!
-
Miryalaguda : వాడపల్లి యాస్సైపై ఎస్సీ ఎస్టీ శాఖ పరమైన చర్యలకు ఆదేశాలు..!
-
Groups : గ్రూప్ – 1 లో ప్రతిభ.. డీఎస్పీగా ఉద్యోగం సాధించిన ఐశ్వర్య..!
-
Elections : ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ..!
-
KLI : తెగిపోయిన కేఎల్ఐ కాలువ.. వృధాగా పోతున్న నీరు..!









