TOP STORIESBreaking Newsతెలంగాణ

TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రేషన్ కార్డులు కట్..!

TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రేషన్ కార్డులు కట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలోని రేషన్ కార్డుల పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. కొత్తగా మంజూరు చేసే కార్డులతో పాటు పాత కార్డుదారులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే అనర్హులను గుర్తించి వారికి రేషన్ కార్డులు తొలగించే అవకాశాలు ఉన్నాయి.

కార్లు, బంగ్లాలు ఉన్నవారికి కూడా రేషన్ కార్డులు ఉన్నట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. అంతేకాకుండా ఇటీవల సర్వే సందర్భంగా రేషన్ కార్డులో ఉన్నవారికి ఆస్తిపాస్తులు ఉన్నాయనే విషయాన్ని అధికారులు గుర్తించారు.

దాంతో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో అనర్హలను తొలగించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.30 లక్షల రేషన్ కార్డులను తొలగించే అవకాశాలు ఉన్నాయి. పెద్ద భవనాలు, కార్లు, షాపింగ్ దుకాణాలు, పది ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నవారికి రేషన్ కార్డులు కట్ చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే గత పది సంవత్సరాలుగా కొత్త కార్డుల జారీ చేయకపోవడంతో పాటు తొలగింపు కూడా చేపట్టలేదు.

అందుకు ప్రస్తుతం స్మార్ట్ కార్డుల పంపిణీ సందర్భంగా కొత్తవారికి రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు పాత వారిలో అనర్హలను తొలగించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల మందికి సంబంధించి డెత్ సర్టిఫికెట్లు అందినప్పటికీ వారిని రేషన్ కార్డులలోనే కొనసాగిస్తున్నారు. అలాంటి వారిని కూడా తొలగించనున్నారు.

90 లక్షల రేషన్ కార్డులు :

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. పాత వారితో పాటు కొత్త వారిని కూడా గుర్తించి వారికి కూడా స్మార్ట్ కార్డులు అందజేయనున్నారు. స్మార్ట్ కార్డులలో ఏటీఎం కార్డు తరహాలో ప్రత్యేక చిప్, యూనిట్ నెంబర్ తో ఉండే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు.

కొత్త దరఖాస్తులు ఎన్ని..?

రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డుల కోసం మీసేవ కేంద్రాల ద్వారా 1.50 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు సివిల్ సప్లై అధికారులు పేర్కొంటున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో ఇప్పటికే లక్ష వరకు అప్లికేషన్లు వచ్చాయని, మరో లక్ష వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉండగా కుల గణన సర్వే, మీ సేవ కేంద్రాలతో పాటు గతంలో వచ్చిన అప్లికేషన్లు మొత్తం ఇప్పటివరకు 10 లక్షలకు పైగా దరఖాస్తులు అందినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా మరో 20 లక్షలకు పైగా అప్లికేషన్లు మార్పులు, చేర్పుల కోసం వచ్చినట్లు తెలుస్తుంది. వీరందరికీ ప్రత్యేక యూనిక్ నెంబర్ తో స్మార్ట్ కార్డులను అందజేయనున్నారు.

మార్చి మొదటి వారంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికల కోడ్ లేని జిల్లాలలో మార్చి ఒకటో తేదీన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టే అవకాశాలున్నాయి. ఆ తర్వాత కోడ్ ముగియగానే రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు.

MOST READ :

  1. Indiramma Atmiya Bharosa : రైతు కూలీలకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో డబ్బులు జమ..!

  2. Mega Job Mela : మెగా జాబ్ మేళా.. 100 కంపెనీలు, 20వేల ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా..!

  3. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. విధుల పట్టణ నిర్లక్ష్యం వహించిన తహసిల్దార్ సస్పెండ్..!

  4. Gold Price : చాలా రోజుల తర్వాత.. భారీగా పడిపోయిన పసిడి ధర..!

  5. TGSRTC : ఆర్టీసీలో 1500 మంది నియామకం.. సర్క్యులర్ విడుదల..!

  6. Miryalaguda : రాత్రికి రాత్రే పంట పొలంలో రూ.20 లక్షలు.. నల్గొండ జిల్లా దామరచర్లలో ఘటన..!

  7. District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఎంపీడీవో, ఎంపీవో సస్పెండ్..!

మరిన్ని వార్తలు