Ration Cards : రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లేటెస్ట్ అప్డేట్..!

Ration Cards : రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లేటెస్ట్ అప్డేట్..!
తెలంగాణలో పేదలకు రేషన్ కార్డుల పంపిణీ చేయాలను ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 26వ తేదీ నుంచి రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే వెల్లడించారు. దాంతో తెలంగాణలో మరో 30 లక్షల మంది పేదలకు రేషన్ లభించే అవకాశాలు ఉన్నాయి.
రేషన్ కార్డుల జారీకి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. రేషన్ కార్డు లేని వారికి నూతన కార్డులు జారీ చేయడంతో పాటు ఉన్న కార్డులో ఫ్యామిలీ మెంబర్ల పేర్ల నమోదుకు అభ్యర్థిస్తూ వచ్చిన అప్లికేషన్లు ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జనవరి 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఇటీవల జరిగిన సామాజిక ఆర్థిక సర్వేలో రాష్ట్రంలోని పేదల వివరాలు.. అర్హులైన ప్రజల్లో రేషన్ కార్డులు ఉన్నవారి, లేని వారికి సంబంధించిన సమాచారం కూడా ఉంది.
రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి, వివరాలను గ్రామసభలు బస్తీ సభల్లో ప్రదర్శించనున్నారు. గ్రామసభలు, బస్తి సభలోనే వారి పేర్లను కూడా ఖరారు చేయనున్నారు. అయితే ఇంకా రేషన్ కార్డులకు సంబంధించిన డిజైన్ కాలేదు. దీనికి కొంత సమయం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 89.96 లక్షలు మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. దీంతో 2.1 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. వీటిలో 5.66 లక్షల మందికి అంత్యోదయ కార్డులు, అన్నపూర్ణ స్కీం కింద 5416 కార్డులు ఉన్నాయి.
లేటెస్ట్ :
-
BREAKING : మంత్రి పొంగులేటి కారుకు ప్రమాదం..!
-
Gold Price : మరోసారి పసిడి షాక్.. పెరిగిన రూ.1700..!
-
Rythu Bharosa : రైతు భరోసా అర్హతకు రూల్స్ విడుదల.. మీరు అర్హులేనా.. లేటెస్ట్ అప్డేట్..!
-
Nelakondapalli : డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తారా.. చావమంటారా.. పురుగుల మందు డబ్బాలతో హల్ చల్..!
-
Nalgonda : 26న ప్రారంభమయ్యే పథకాలు వారికి అస్సలు ఇవ్వొద్దు..!









