Telangana : తెలంగాణ ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్.. కీలక నిర్ణయాలు..!
Telangana : తెలంగాణ ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్.. కీలక నిర్ణయాలు..!
హైదరాబాద్ , మనసాక్షి :
రేషన్ డీలర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. ఎంతో కాలంగా పలు డిమాండ్లపై ఆందోళనలు, వినతి పత్రాలు అందజేసిన రేషన్ డీలర్లకు ప్రభుత్వం శుభవార్త తెలియజేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ తో రేషన్ డీలర్లు చేపట్టిన చర్చలు సఫలమయ్యాయి.
ప్రధానంగా రేషన్ డీలర్లకు ఇప్పటివరకు ఇస్తున్న కమిషన్ 70 రూపాయల నుంచి 140 రూపాయలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా రేషన్ డీలర్లు అందరికీ హెల్త్ కార్డులు అందజేయాలని కూడా నిర్ణయించారు. కరోనా సమయంలో చనిపోయిన రేషన్ డీలర్ల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు డీలర్ షిప్ ఇవ్వాలని కూడా నిర్ణయించారు.
ALSO READ :
- Admin Review : కొత్త టూల్స్.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ల శక్తివంతం ..!
- వామ్మో మామూలు భార్య కాదు ఆమె : భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..!
- Gruhalakshmi : గృహ లక్ష్మీ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం..!
- అనుమానాస్పద స్థితిలో 6 సంవత్సరాల బాబు మృతి
పలు కీలక నిర్ణయాలపై చర్చలు జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులను ఆదేశించగా చర్చలు నిర్వహించారు. చర్చలు నిర్వహించిన మంత్రులు రేషన్ డీలర్ల సమస్యలపై సానుకూలంగా స్పందించారు. చర్చలు సఫలం కావడంతో రేషన్ డీలర్ల సంఘం నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.










