అనుమానాస్పద స్థితిలో 6 సంవత్సరాల బాబు మృతి

అనుమానాస్పద స్థితిలో 6 సంవత్సరాల బాబు మృతి
సూర్యాపేట రూరల్, మనసాక్షి
సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ పేస్ 3 కు చెందిన మచ్చ మధు కుమారుడు వయసు ఆరు సంవత్సరాలు సూర్యాపేట పబ్లిక్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. మచ్చ మధు తన మొదటి భార్యను కులాంతర వివాహం 2015లో చేసుకున్నాడు. వారికి పుట్టిన బాబు టైసన్ మొదటి భార్య టైసన్ ను మధు దగ్గర వదిలి వేరే వివాహం చేసుకున్నది.
ప్రస్తుతం మధు వాణి అను అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకొని ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. వారితో పాటు టైసన్ ఉంటున్నాడు. నిన్న 04,08,2023, రోజున స్కూల్ వదిలిపెట్టిన తర్వాత సాయంత్రం 5:30 గంటలకు ఇందిరమ్మ కాలనీ పేస్ 3 లో గల తన ఇంటికి వచ్చాడు. తర్వాత టైసన్ కడుపులో నొప్పిగా ఉందని వాణి తో చెప్పగా వాణి టైసన్ తండ్రి మధుకు ఫోన్ ద్వారా తెలిపినవి మధు ఇంటికి వచ్చే సరికే టైసన్ అపస్మారక స్థితిలో ఉన్నాడు.
ALSO READ :
- మిర్యాలగూడ : దొంగతనాలకు, మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు
- Education : తెలంగాణలో కెసిఆర్ విద్యా కానుక..!
- Runa Mafi : రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది..? తెలుసుకుందాం..!
అతనిని వెంటనే సూర్యాపేటలోని నియో హాస్పిటల్ కి తరలించారు. టైసన్ అప్పటికే మృతి చెందాడని డాక్టర్ నిర్ధారించాడు. టైసన్ గొంతుపై నలుపు రంగు మరకలు ఉన్నందున అతని మరణం పై అనుమానం ఉన్నదని టైసన్ నాయనమ్మ మచ్చ కమలమ్మ ఫిర్యాదు పై అనుమానాస్పద మృతిగా సూర్యాపేట రూరల్ ఎస్సై ఆర్ సాయిరాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.