మిర్యాలగూడ : దొంగతనాలకు, మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు

మిర్యాలగూడ : దొంగతనాలకు, మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు
మిర్యాలగూడ, మనసాక్షి:
దొంగతనాలకు మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు నల్గొండ జిల్లా ఎస్పీ అపూర్వరావు తెలిపారు. శనివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో విలేకరులతో మాట్లాడుతూ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
వారి వద్ద నుంచి సుమారుగా 50 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల విలువైన ఏడు కార్లను, ఏడు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. కేసును చేదించిన పోలీసులను ఆమె అభినందించారు. సమావేశంలో డిఎస్పీ వెంకటగిరి, సీఐ, ఎస్ఐలతో పాటు పలువురి పోలీస్ లు, సిబ్బంది పాల్గొన్నారు.
ALSO READ :
- Education : తెలంగాణలో కెసిఆర్ విద్యా కానుక..!
- Runa Mafi : రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది..? తెలుసుకుందాం..!
- UGC : ఆ యూనివర్సిటీలు ఫేక్.. ఆ డిగ్రీలు చెల్లవు..!
- PhonePe : ఫోన్ పే గుడ్ న్యూస్.. కేవలం రూ.49 తో రూ. లక్ష..!