Breaking Newsఉద్యోగంతెలంగాణ

TGPSC : తెలంగాణ గ్రూప్ 3 ఫలితాలు విడుదల..!

TGPSC : తెలంగాణ గ్రూప్ 3 ఫలితాలు విడుదల..!

మన సాక్షి, హైదరాబాద్ :

తెలంగాణలో గ్రూప్ 3 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులతో ప్రొవిజినల్ నోటిఫికేషన్ గురువారం టిజిపిఎస్సి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. మొత్తం 1370 గ్రూప్ 3 పోస్టులకు ఈ జాబితా విడుదలైంది.

గత సంవత్సరం నవంబర్ లో ఉద్యోగ నియామాకానికి పరీక్ష నిర్వహించగా సుమారు 2.67 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. గతంలో జనరల్ ర్యాంకింగ్స్, మెరిట్ జాబితాలను విడుదల చేసిన అధికారులు వెబ్ ఆప్షన్లు నమోదు అనంతరం అభ్యర్థులకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేశారు.

తాజాగా ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను వెబ్ సైట్ లో ఉంచారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లు, ఎంపికైన ఉద్యోగం కోడ్, ప్రాంత వివరాలను జాబితాలో ఉంచారు. మొత్తం 1388 పోస్టులకు గాను ప్రస్తుతం 1370 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇదిలా ఉండగా ఒక పోస్ట్ హోల్డ్ చేసిన అధికారులు మరో 17 పోస్టుల ఫలితాలను తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు.

MOST READ 

  1. ACB : రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన రెవెన్యూ ఇన్స్పెక్టర్..!

  2. Aadhaar : ఆధార్ కార్డులో ఫోటో బాలేదా.. మార్చుకోవాలంటే వెరీ సింపుల్..!

  3. Miryalaguda : నేడు విద్యుత్ కోత.. మండలాలు, వేళలు ఇవే..!

  4. Rythu : కౌలు రైతులకు గుడ్ న్యూస్.. రూ. లక్ష వరకు రుణం..!

మరిన్ని వార్తలు