TG MLA : భూకంపం నుంచి ప్రాణాలతో బయటపడ్డ తెలంగాణ ఎమ్మెల్యే..!
TG MLA : భూకంపం నుంచి ప్రాణాలతో బయటపడ్డ తెలంగాణ ఎమ్మెల్యే..!
మన సాక్షి, వెబ్ డేస్క్ :
మయన్మార్ లో భూకంపం వచ్చి అక్కడ ప్రజలు చిన్నబిన్నం అయ్యారు. అదేవిధంగా థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో భూకంపం సంభవించి తీవ్ర విషయం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఒక్కసారిగా వచ్చిన విపత్తుతో అక్కడి ప్రజలు చెల్లాచెదరయ్యారు. భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రాణాలు కూడా వేళల్లో ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మయన్మార్, బ్యాంకాక్ తో సహా చైనా, భారత్, వియత్నం మరికొన్ని తూర్పు దేశంలో కూడా భారీ భూకంపం సంభవించింది.
తప్పించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే :
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కుటుంబం భూకంపం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. వారి కుటుంబం బ్యాంకాంగ్ టూర్ లో ఉన్నారు. రాజ్ ఠాగూర్ ఆయన భార్య, కూతురు, అల్లుడు అందరూ బ్యాంకాక్ లో ఉన్నారు. కాగా భూకంపం సంభవించిన సమయంలో వారు ఉన్న హోటల్ కూడా కుప్పకూలింది. అయితే అదృష్టవశాత్తు వారు కొద్ది నిమిషాల క్రితమే హోటల్ నుంచి బయటికి వెళ్లారు. దాంతో ఎమ్మెల్యే కుటుంబం మొత్తం ప్రాణాలతో బయటపడింది. వారంతా ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. తొందరలోనే తిరిగి ఇండియాకు రానున్నారు.









